తెలంగాణ త‌ల్లి విగ్రహం అంటే తెలంగాణ ప్ర‌జ‌లంద‌రి మ‌న‌స్సులో మెదిలేది ఒకే విగ్ర‌హం. ఒకే రూపు. ఇప్పుడు రూపం మారింది. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ల‌ది. వారికొక ఆలోచ‌న వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న‌ది ఉద్య‌మ స‌మ‌యంలోనిది. టీఆరెస్ ఆలోచ‌న‌లోంచి పుట్టింది. మ‌రి మేము అధికారంలోకి వ‌స్తే.. మాకంటూ ప్ర‌త్యేకత ఉండాలె క‌దా..? అని అనుకుని ఉంటారు బ‌హుశా. ఏకంగా పార్టీ రంగు పులిమేశారు. నెత్తినైతే కిరీట‌మేదీ పెట్ట‌లేదు. ఒక చేతిలో చెరుకుగ‌డ ఉంది. అతే. సింపుల్‌గా శాంపిల్‌గా ఇగో మా తెలంగాణ త‌ల్లి ఇలా ఉంటుంది అని చెప్పిన‌ట్టు ఉంది.

మ‌రి బీజేపీ వాళ్లకు కూడా త్వ‌ర‌లోనే ఇలాంటి ఆలోచ‌న రావొచ్చేమో. సెకండ్ ప్లేస్‌లో మేమే ఉన్నం. వ‌స్తే గిస్తే మేమే వ‌స్తం అధికారంలోకి. మ‌న‌మెందుకు మ‌న పార్టీ త‌ర‌పున ప్ర‌త్యేకంగా ఓ తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం రూపొందించొద్దు.. అని అనుకున్నా అనుకుంటారు. త‌యారు చేసిన చేస్తారు.

తెలంగాణ త‌ల్లి ఒక్క‌రుంటే స‌రిపోదా..? అది మీ పార్టీది.. ఇగో ఇది మా పార్టీదీ.. ఎందుకింత సంకుచిత‌త్వం. మీరు అధికారంలోకి వ‌స్తే ఇప్పుడున్న తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల మాల వేసి దండం పెడితే ఏమ‌న్నా నామోషా..? వాళ్ల కిరీటాలు ఏమైనా ప‌డిపోతాయా…? అవ‌మాన‌మేమైనా జ‌రుగుతుందా..? ఆత్మ‌గౌర‌వ‌మేమైనా దెబ్బ‌తింటుందా..??

You missed