బిగ్ బాసు-6… కొత్తగా ఉంది. నాగార్జున కూడా కొత్త లుక్తో కనిపించాడు. ఆరంభంలో నాగ్ పాడిన పాటే పంటికింద రాయిలా ఉంది. ఏం బాగలేదు. కానీ ఇంతకు ముందులా క్రేజ్ బాగా తగ్గినట్టు కనిపిస్తోంది ఈ షో పట్ల. ఓటీటీలో వేసిన తర్వాత ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు మళ్లీ టీవీలో వేసి ప్రేక్షకులు ఆదరణ పొందాలని చూస్తున్నారు. కొంత వరకు ఓకే. కంటెస్టెంట్స్ల ఎంపిక మాత్రం ఈసారి కొత్తగా అనిపించింది.
కింద స్థాయి నుంచి ఎదిగినవాళ్లని, కష్టపడి పైకొచ్చిన వాళ్లని, శ్రమను నమ్ముకున్న వాళ్లను, ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్నవాళ్లని ఎంచుకున్నారు. చాలా వరకు పూర్ ఫ్యామిలీస్ నుంచే ఉండటం బాగుంది. వీరే కాదు.. సెలబ్రిటీల పేరుతో కొంత మంది వచ్చినా వాళ్లంతా పెద్దగా ఆకట్టుకునే రీతిలో ఉండరనేది తేలిపోయింది. అన్నీ కొత్త ముఖాలే దాదాపుగా. సైనా, ఆదిరెడ్డి, రాజ శేఖర్, నీతూ, సైనీ సాల్మాన్, నీతూ,సూర్య …. వీరికి మంచి అవకాశం. అభియన శ్రీ, రేవంత్, చంటి, బాలాదిత్య…. కొంచెం గుర్తుపట్టే ముఖాలు.. కానీ మరీ ఉత్సాహాన్ని తెచ్చే కంటెస్టెంట్స్ ఏమీ కాదు…