5న ఇందూరులో సీఎం సభ ఏమో గానీ బీజేపీ కయ్యానికి కాలు దువ్వుతూ రెచ్చగొట్టే పనికి శ్రీకారం చుట్టింది. మొండిగా 3న సభ నిర్వహించాలని తలపెట్టింది. కలెక్టరేట్ గ్రౌండ్, ఐటీఐ గ్రౌండ్‌ను సభ కోసం ఇవ్వాలని పర్మిషన్ కోరగా.. జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో బీఎల్ఎన్ గార్డెన్‌లో సభ పెట్టుకోవాలని నిర్ణయించారు. ఇందూరు జనతా కో జవాబ్ దో సీఎం .. అనే పేరుతో ఈ సభను నిర్వహిస్తున్నట్టు ఎంపీ అర్వింద్ ఇక్కడ ప్రెస్‌మీట్‌లో చెప్పాడు.
తాను పసుపు బోర్డు తెస్తానని రాసిచ్చిన బాండ్ పేపర్ ను పట్టుకుని ఊరూరు తిప్పుతున్నారని, మరి మీ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన వాటినన్నింటినీ అమలు పరిచారా..? అని ప్రశ్నించాడు. దీనిపైనే ఇంటింటికీ లేఖ రాస్తున్నామని, 3న సభలో మాట్లాడతామని.. వీటికి సీఎం 5న జరిగే సభలో సమాధానాలివ్వాలని అన్నాడు.