హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ! ముగ్గురు నలుగురు మాజీ క్రికెటర్ ల చేతిలో బందీ .. మొత్తం కంపు . బాగా ఆడే పిల్లలకు అవకాశం వచ్చే ఛాన్స్ లేదు . మొత్తం చెత్త . జస్ట్ ఇదొక ఉదాహరణ . ఇంచుమించు అన్ని రకాల క్రీడా అకాడెమీలలో ఇదే దుస్థితి . ప్రతిభకు పాతర . నువ్వు ఎంత కస్టపడి ఆడినా . నీకు ఎంత టాలెంట్ వున్నా లాభం లేదు . రాజకీయాలతో అణగదొక్కేస్తారు .

మనింటి బిడ్డ ఆరో తరగతి నుంచి ఐఐటీ ఫౌండేషన్ తీసుకోవాలి . ఆటలు పాటలు బంద్ . ఐఐటీ లో సీట్ కొట్టి టెక్సాస్ లో సెటిల్ కావాలి . పంపిన డబ్బుతో ప్లాట్స్ ఫ్లాట్స్ కొని పక్కింటోడికి గొప్పలు చెప్పుకోవాలి . ఎవడో బిడ్డ ఆటలు ఆడి దేశానికీ పతకాలు తీసుకొనిరావాలి . ఇదీ టిపికల్ పేరెంట్ ధోరణి .

ఒక ఇంచ్ గ్రౌండ్ లేని రా నాయన .. పారాయణ లాంటి పాఠశాలలు కోకొల్లలు . బాల్యం అప్పట్లో తరగతి గదిలో బందీ .. { ఇప్పుడు ఇంట్లోనే బంధీ } ..

దేశానికీ ఒలింపిక్స్ లో మెడల్స్ రావాలి !

ఆట కదరా శివా ! ఆట కదా కేశవ !

ఆట కదా ఓటములు ! ఆట కదా సున్నా మెడల్స్ !

 

Amarnath Vasireddy