మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో భాగంగా మూడో స్థానం కోసం చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోతో జరిగిన పోరులో సింధు విశ్వ‌రూపం చూపింది. భారీ అంచనాల నడుమ ఒలింపిక్స్‌కు వెళ్లిన సింధు.. దాన్ని సాకారం చేసుకుంటూ భారత్‌కు పతకం అందించి త్రివర్ణపతకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించింది. పీవీ సింధు 21-13, 21-15 తేడాతో బింగ్‌ జియావోపై గెలిచింది. 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో రజతం సాధించింది. స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించలేదనే బాధ ఒక్కటే తప్పితే యావత్‌ భారతావని మనుసుల్ని గెలిచింది సింధు.

కాంస్య పతక పోరులో సింధు విజృంభించి ఆడింది. ఆది నుంచి కచ్చితమైన ప్రణాళికతో బింగ్‌ జియావోపై ఆధిపత్యం కనబరిచింది. ప్రధానంగా తొలి గేమ్‌లో వరుసగా నాలుగు పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని కనబరిచింది. ఇక రెండో గేమ్‌ ఆదిలో అదే జోరును కొనసాగించి సింధు.. మధ్యలో కాస్త తడబడినా కాస్త ఆసక్తికరంగా సాగిన రెండో గేమ్‌లో సింధు కడవరకూ ఆధిక్యాన్ని నిలుపుకుంటూ వచ్చింది. రెండో గేమ్‌లో తొలి అర్థభాగం ముగిసిన తర్వాత సింధు 15-12, 18-14 తేడాతో భారీ తేడాను కొనసాగించింది. చివరకూ 21-15 తేడాతో బింగ్‌ జియావోను మట్టి కరిపించి కాంస్య పతకాన్ని సాధించింది. ఈ విజయంతో యావత్‌ భారతావని మనసులు గెలుచుకుంది.