జర్నలిస్టుల జీవితాలు పైన పటారం లోన లొటారం. మేస్త్రి పెండ్లాం రాత్రికి ఉపాసం అనే సామెత ఒకటుంది. అది అక్షరాలా జర్నలిస్టులకు సరిపోతుంది. పత్రికల్లో ఊడిగం. జీతం ఉండదు. వెట్టి చాకిరి. ఆరోగ్యాలు గాలిలో దీపాలు. ఒక్క అక్రిడియేషన్ వస్తే చాలు వాడి జీవితం ధన్యమైనట్టే. దాన్ని చూసుకుని బతికేస్తాడు రోజుల తరబడి. అంతే పెండ్లాం పిల్లలక్కర్లేదు. ప్రభుత్వాలు కూడా అలా కరివేపాకుల వాడుకుని వదిలేస్తాయి. అంతటి గొప్ప జీవితమన్న మాట జర్నలిస్టులవి.
ఇక వారి పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఫ్రీ చదువు చెప్పండని పాపం.. ప్రతీ ఏడు ఈ డీఈవో ఇలా ఉత్తర్వులు విడుదల చేస్తా ఉంటాడు. దీన్ని ఎవడూ పట్టించుకోడు.. పోపోవోయ్… భలే చెప్పొచ్చావ్… అని అలా గంజిలో ఈగతను తీసేసినట్టు సదరు ఈ డీఈవో గారి ఉత్తర్వుల ప్రతిని తీసి చెత్త బుట్టలో వేస్తారు. ఏదేమైనా మన సర్కార్ కన్నా.. ఈ డీఈవో చాలా బెటర్ బ్రదర్. కనీసం ఆ కటుంబాలకు ఏదైనా చేద్దామన్న ఆలోచనైనా ఉంది.
