ప్రధాని మోడీ హైదరాబాద్ రాక ఏమోగానీ ప్రశ్నలు, నిలదీతలు, సోషల్ మీడియాలో విమర్శలు… గతంలో ఎన్నడూ లేనంతగా ట్రోలింగు…… ఇవన్నీ రాజకీయంగా బీజేపీ, టీఆరెస్ మధ్య భవిష్యత్ పోటీని సూచిస్తున్నాయి. ఓ వైపు సీఎం, మరోవైపు టీఆరెస్ నేతలు …. ఎవరికి తోచించి వారు ప్రశ్నిస్తన్నారు. సవాల్ కో జవాబ్ దో అని అడిగేస్తున్నారు. మా తెలంగాణకు వచ్చిన మీరంతా ఇక్కడ అభివృద్ధి చూసి నేర్చుకుని పోండ్రి… అంటూ సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు.
సరే, ఇదంతా ఒకవైపు. నిజామాబాద్ జిల్లా ప్రజల తరపును కూడా ఓ ప్రశ్న మోడీకి తాకింది. ఈ ప్రశ్నకు జవాబేది మోడీ జీ అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇక్కడి జిల్లా ప్రజల తరుపున ఓ ప్రశ్నాస్త్రాన్ని సంధించారు. ఇందూరుకు పసుపు బోర్డు ఎందుకు తేలేకపోయారు…? మీ నేత అర్విందు ఇక్కడి రైతులను, ప్రజలను మోసం చేసి, మోస పూరిత వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చాడు. ఎంపీ అయ్యాడు. కానీ పసుపు బోర్డు మాత్రం రాలేదు. అవునా..? కాదా..? జర దీనికి సమాధానమివ్వు ప్రధాని గారు…? అంటూ సూటిగా సోషల్ మీడియాలో తన ప్రశ్నను సంధించాడు ప్రశాంత్ రెడ్డి.