రెండు వేల రూపాయల నోటు చూసి ఎన్ని రోజులైందో..? అవి ఎక్కడికక్కడ ప్యాక్ చేసేశారు. బ్యాంకుల్లో కూడా కనిపించడం లేదు. ఏటీఎంలో దర్శనమివ్వక నెలలు, సంవత్సరాలే గడుస్తున్నాయి. దీంతో కొంత కాలం క్రితం నుంచే జనాల్లో అనుమానం మొదలైంది. ఈ రెండు వేల రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేస్తుందేమోనని. వాస్తవానికి ఈ నోటును తీసుకొచ్చినప్పుడే చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. రెండు వేల పెద్ద నోటుతో మరింతగా మనీ బ్లాక్ అయ్యే అవకాశం ఉందని, అక్రమార్కులు వీటిని ఎక్కడికక్కడ ప్యాక్ చేసే ప్రమాదం ఉందని భావించారు. ఈ నోట్లు ఎక్కువ రోజులు చెలామణిలో ఉండబోవని కూడా ముందే ఊహించారు. ఊహించినట్టే అవి కొద్ది రోజుల్లోనే మార్కెట్లో కనిపించకుండా పోయాయి. తాజాగా ఆర్బీఐ ఓ నివేదిక విడుదల చేసింది. మళ్లీ పెద్ద నోట్ల రద్దు జరగవచ్చనే విధంగా ఆ నివేదిక సూచనలు ఇస్తోంది. ఇప్పుడిదే చర్చకు తెరతీసింది. 500 నోట్లు, 2వేల నోట్లు నకిలీ పెరిగావని, 500 ఫేక్ నోట్లు 101 శాతం, 2వేల ఫేక్ నోట్లు 54 శాతం పెరిగావని తెలిపింది. 50, 100 నోట్లు తప్ప ఈ రెండు పెద్ద నోట్లు ఫేక్‌వి పెరిగావని పేర్కొన్నది. దీంతో త్వరలోనే మళ్లీ పెద్ద నోట్ల రద్దుకు ముహూర్తం ఖారయ్యిందా..? అనే చర్చలు సాగుతున్నాయి.