అనువుగాని చోట అధికులమ‌న‌రాదు….. అన్న‌ట్టుగా రెడ్ల గ‌ర్జ‌న సభ‌కు వెళ్లి టీఆరెస్ ప్రెస్‌మీట్‌లో స్క్రిప్టెడ్ మాట‌లు మాట్లాడిన‌ట్టు….. కేసీఆర్ … మ‌ళ్లీ టీఆరెస్ స‌ర్కార్‌… అంటూ వ‌ళ్లెవేస్తే రెడ్లు ఊకుంట‌రా..? త‌రిమి త‌రిమి కొట్టిర్రు. మధ్య‌లోనే స్పీచ్ ఆపేసేదాక లొల్లి లొల్లి చేసిండ్రు.. మ‌ధ్య‌లో ఆపి కారు ఎక్కి పారిపోతుంటే ఉరికురికి త‌రిమిర్రు. రేవంత్ పెట్టి రెడ్డి చిచ్చు ఇలా రాజుకుని అగ్గి భ‌గ్గుమ‌ని అది కాంగ్రెస్‌కు అంటుకుని భ‌గ‌భ‌గ మంటుంది. మ‌ల్లారెడ్డి దీనికి ఆజ్యం పోసి అంటించి పారిపోయిండు. ఏమ‌న్న అంటే కాంగ్రెస్‌కు ఒక రెడ్లే కావాల్నా..? బీసీలు వ‌ద్దా..? ఎస్సీ, ఎస్టీలు అవ‌స‌రం లేదా..? అని స‌మాజంలో ఓ చ‌ర్చ జ‌ర‌గాల‌నేది మ‌ల్లారెడ్డి టార్గెట్‌. అదే చేసిండు. రెచ్చ‌గొట్టి పారిపోయిండు. ఈ రేవంత్ రెడ్డి రెడ్ల రావ‌ణ కాష్టం కాంగ్రెస్‌ను కాల్చ‌డం మొద‌లు పెట్టింది. ఈ కాలుడు… ఎప్ప‌టి వ‌ర‌కో. దీన్ని ఆర్పుతారా? ఆహుతుల‌వుతారా? వెయిట్ అండ్ సీ…

You missed