గ‌తంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌న్నీ ఒక‌త్త‌యితే .. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక వాట‌న్నింటిని త‌ల‌ద‌న్ని రాష్ట్రంలోనే స్పెష‌ల్ నియోజ‌క‌వ‌ర్గంగా నిల‌వ‌నుంది. చాలా విష‌యాల్లో ఇదో రికార్డుగా నిల‌వ‌నుంది. మిగిలిన నియోజ‌వ‌క‌ర్గాల‌కు ఆద‌ర్శం కానుంది. ఒక ఉప ఎన్నిక ద్వారా ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలియ‌జెప్పే ఉప ఎన్నిక ఇది. అందుకే అంత‌టా ఇప్పుడు ఇదే నినాదం వినిపిస్తున్న‌ది. రాజీనామా చెయ్యండ‌ని ఎమ్మెల్యేల‌కు పిలుపులు వ‌స్తున్నాయి.

ఇక్క‌డ ఎక్క‌డా లేని విధంగా ప‌డ‌కేసిన పాత ప‌థ‌కాలు ప‌రుగులు పెడ‌తాయి. కొంగొత్త ప‌థ‌కాల‌కు ఇక్క‌డే అంకురార్ప‌ణ జ‌రుగుతుంది. వేల కోట్ల రూపాయ‌లను ప‌థ‌కాల‌కు రూప క‌ల్ప‌న‌కు ఇది పురిగొల్పుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతీ లేదు. కానీ ఇక్క‌డ ఇవి వెంట‌నే దొరుకుతాయి. రాత్రికి రాత్రే రాజ‌కీయ ఉద్యోగాలొస్తాయి. ప‌ద‌వులు వ‌రిస్తాయి. ఏళ్ల త‌ర‌బ‌డి ఎలాంటి ప‌దువ‌ల్లేక నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చుని దీనంగా వారిని ప్ర‌గ‌తి భ‌వ‌న్ కో, తెలంగాణ భ‌వ‌న్ కో పిలిచి మ‌రీ నిరుద్యోగ భృతి ఇప్పించేస్త‌రు. మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌గ‌తిభ‌వ‌న్ గేటు దాకా వెళ్లాలంటే పెట్టి పెట్టాలి. కానీ ఇప్ప‌డు లోప‌లికే ద‌ర్జాగా వెళ్లొచ్చు. చిన్న ఫోన్‌కాల్ చాలు ప్ర‌గ‌తిభ‌వ‌న్ గోడ‌లు స్పందిస్తారు. పెద్ద సారు ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తాడు. స‌హ‌పంక్తి భోజ‌నాలు పెట్టించి అభిన‌వ అంబేద్క‌ర్ అంటే ఎక్క‌డో లేడు అనేలా చేస్తాడు. సొంత పార్టీ పెద్ద‌లే త‌మ‌కు కోట్ల రూపాల‌య ఆఫ‌ర్లిచ్చి రార‌మ్మ‌ని పిలుస్తారు. అర్ధ‌రాత్రి ల‌క్ష్మీదేవీ వ‌చ్చి త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ రూపాయ‌ల సంచుల‌కు కుమ్మ‌రించి వెళ్తుంది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ద‌ర‌ద్రిం ద‌రిదాపుల్లోకి ఇక రాదు. తంతే బూర‌ల బుట్ట‌లో ప‌డ్డ‌ట్టు హుజురాబాద్ ఉప ఎన్నిక ఇక్క‌డి నేత‌ల‌ను కోటిశ్వ‌రుల‌ను చేసి చూపించింది.

 

అదృష్టం ద‌రిద్రం ప‌ట్టిన‌ట్టు ప‌ట్టింది. బంగారుబాతు గుడ్డులా రోజూ పండుగే.పండుగ‌కు మ‌న‌కు ఖ‌ర్చ‌వుతుంది. కానీ ఇక్క‌డ ఆదాయం వ‌స్తుంది. అదీ తేడా. మూల‌కు ప‌డ్డ నేత‌లకు ఇక్క‌డ వెయ్యేగుల బ‌లం వ‌స్తుంది. ఇంత‌టి అదృష్ట‌జాత‌కం వ‌చ్చిప‌డుతుంద‌ని ఏనాడూ ఊహించ‌లేదు క‌దా.

 

ఇదిలాగే కొన‌సాగితే ఎంత బాగుండు…
డ‌బ్బు సంచులు రోజూ వ‌చ్చి పడితే ఎంత బాగుండు..
ప్ర‌భువులు పిలిచి ప‌దువులిస్తామ‌నే రోజులు ఇలాగే ఉంటే ఎంత బాగుండు…
స‌హ‌పంక్తి భోజ‌నాలు తినే రోజులిలాగే ఉంటే ఎంత బాగుండు….
మొన్న‌టి వ‌ర‌కు మేమో అల్పుల‌మ‌నే ఆత్మ‌నూన్య‌త‌ను పోగొట్టిన సంద‌ర్భం ఇలాగే ఉంటే ఎంత బాగుండు
అస‌లు ఈ హుజురుబాద్ ఉప ఎన్నిక ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌క‌పోతే ఎంత బాగుండు..
ఇది మ‌రింత ఆల‌స్య‌మై .. మేము మ‌రింత ధ‌నికుల‌మైపోతే ఎంత బాగుండు…

 

మ‌రింత‌…. ఇంకింత‌…. మ‌రింకింత ఆల‌స్య‌మైతే
ఇంకెంత ఇంకెంత బాగుండు…!!