సిల్లీ పాయింట్‌
….
ఈ చిన‌జీయ‌ర్ ధైర్య‌మేందోగానీ..
ప్ర‌జ‌ల ఆహార‌పు అల‌వాట్ల‌ను అవ‌మానిస్తున్న‌డు
జీవ‌న విధానాన్ని అవ‌మానిస్తున్న‌డు
ఆహార్యాన్ని అవ‌మానిస్తున్న‌డు
సంప్ర‌దాయాల‌ను అవ‌మానిస్తున్న‌డు

ఆయ‌న చేస్తున్న మాట‌ల దాడి..
ప్ర‌తిసారి ఉత్పాద‌క స‌మాజంపైనే ఉంటున్న‌ది.
చెమ‌ట చిందించి దేశానికి, స‌మాజానికి తిండి పెట్టే వ‌ర్గాల‌నే టార్గెట్ చేస్తున్న‌డు..
బ‌హుశా ఇది సంస్కృతీక‌ర‌ణ కుట్ర‌లో భాగం కావ‌చ్చు.
స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌.. దేవ‌త‌లు కాక‌పోవ‌చ్చు. వారు మ‌నుషులే.. వారి జాతి ర‌క్ష‌ణ కోసం పోరాడి దేవుళ్ల‌య్యారు.
మ‌రి….
నువ్వు కొలిచే రాముడు మ‌నిషి కాదా? కృష్ణుడు మ‌నిషి కాదా? వేంక‌టేశ్వ‌రుడు మ‌నిషి కాదా? మ‌నిషిగా పుట్టి మంచి ప‌నులు చేసే దేవుళ్లు అయ్యారు క‌దా?
బ‌డుగు వ‌ర్గాలు పూజించే గ్రామ దేవ‌త‌లంటే అంత చిన్న‌చూపు ఏంది? ఆ దేవ‌త‌లు హిందూ మ‌తంలో భాగం కాద‌ని చెప్ప‌గ‌ల‌వా?
సూటి ప్ర‌శ్న‌..
నేను నా చుట్టూ క‌నిపించే, నాకు మంచి చేసే చెట్టును, పుట్ట‌ను, రాయిని, ర‌ప్ప‌ను దేవునిగా కొలుస్తా..
నిలువు బొట్టు, అడ్డ‌బొట్టు అన్న తేడా లేకుండా అన్ని గుడులు తిరుగుతా? అంద‌రి దేవుళ్ల‌కు మొక్కుత.
మ‌ని నువ్వు…? ఆ ప‌ని చేయ‌గ‌ల‌వా? ఇప్ప‌టివ‌ర‌కు చేసిన‌వా?

ఇప్పుడు చెప్పు
.. నిజ‌మైన హిందువు ఎవ‌రు?
నువ్వా?
నేనా?

Venu Bekkam