నిన్న భీమ్లా నాయక్ ఆడియో కాసేపు చూసాను,మొదట్లో కొత్త యాంకర్ ఒకామె వచ్చారు.భయమేసి టీవీ కట్టేసాను. తర్వాత కాసేపటికి ధైర్యం చేసి టీవీ ఆన్ చేస్తే ఆశ్చర్యంగా సుమ,బహుశా ఆఖరు నిమిషంలో ఆమెను ఆఘమేఘాల మీద తీసుకొచ్చినట్టున్నారు,అందుకే ఆమె పెద్ద తయారు అయ్యి వచ్చినట్టు లేదు,ఐనా సుమ లేని సినీమా ఫంక్షన్ అంటే ఉప్పులేని పప్పు చారు కనుక మనకు తప్పదు.
ఫంక్షన్లో సెంటర్ ఆప్ అట్రాక్షన్ ఖచ్చితంగా కేటీఆర్.కరోనా వచ్చి తగ్గాకా స్లిమ్ కూడా అయినట్టున్నాడు.ఇక అతను వాడిన భాష,ఉచ్చారణ,ప్రసంగించిన తీరు,బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీల నాయకుల్లో,ముఖ్యంగా రెండవ జనరేజన్ నాయకుల్లో అతనికి సాటి రాలేరెవరూ అని అనిపించకమానదు ఎవ్వరికైనా.అంతెందుకు వాళ్ళ కుటుంబంలోనే ఎవరోకరి మీద నోరు పారేసుకునే నాన్న, లేని పోని డాంబికాలకు పోయి కుడితిలో పడిన చెల్లెలు, అవకాశవాద మేనబావలతో పోలిస్తే కేటీఆర్ ఖచ్చితంగా అందరివాడు.ఇక పార్టీలో వెన్ను పూస ఉన్న నాయకులు ఎలానూ లేరు.అవన్నీ పక్కన పెట్టి ఈ ఫంక్షన్ ని గమనిస్తే హైదరాబాద్ నుండి సినీపరిశ్రమ ఇక ఆంధ్రప్రదేశ్ కు తరలి రావడం అసాధ్యం అనిపించింది.జగన్ – పేర్ని నాని కాంబో ను కేటీఆర్ – తలసాని కాంబోల బాడీ లాంగ్వేజ్ ను పోల్చి చూస్తే ఇట్టే తెలిసిపోతోంది హైదరాబాద్ ఆంధ్ర ప్రాంత సినీ ప్రముఖులకు ఎంతటి సేఫ్ అడ్డానో.చిరంజీవిని వంగోబెట్టి
దండాలు పెట్టించుకున్న ఆంధ్ర ప్రభుత్వమెక్కడ, పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని సుమ పాత్ర కూడా తానే పోషించిన
కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వమెక్కడ ? జస్ట్
రెండంటే రెండు మాటలతో బాలీవుడ్ ని హైదరాబాద్ కు తెచ్చేద్దామా అని చందమామను చూపిస్తున్న తెలంగాణ ప్రభుత్వం బెటరా ?మహా మహులకు కూడా మన సినిమా వ్యాపారాలు మూసేసి మనం వేరే పనులు వెతుక్కోవడం బెటర్ అనిపించేలా చుక్కలు చూపిస్తున్న ఆంధ్ర ప్రభుత్వం బెటరా ? మీరే చెప్పండి భీమ్లా నాయక్ కు ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పడంతో పాటు !!!
Raghu Sreemantula
