స్త్రీ & పురుష సంబంధాల విషయంలో.. స్నేహం ద్వారా ఏర్పడిన ప్రేమలో తృప్తీ, సంతోషం కలుగుతాయి. అపుడు ఇతర మోహ సంబంధాలతో అవసరం ఉండదు..
“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
స్త్రీ కి గానీ పురుషుడికి గానీ..
“ఏక కాలమందే, చాలా మంది మీద మోహం వుండటం…” అనే విషయం చూస్తే.,
” పురుషులు అధికులుగానూ, స్త్రీలు అల్పులుగానూ వున్న సమాజం ఇది. స్త్రీ – పురుష సంబందాలలో ఉన్న వైరుధ్యాల మూలంగా.. స్త్రీ – పురుషులకు నిజమైన, నిర్మలమైన స్నేహం ఏర్పడదు..
స్త్రీ ని, పురుషుడు కేవలం కామ దృష్టితో మాత్రమే చూస్తాడు. పురుషుడి దృష్టి ఎప్పుడూ స్త్రీ లలో నూతనత్వాన్నీ, కొత్త కొత్త శారీరక అందాల్నీ వెతుక్కొంటూ, పాత వాటిని తిరస్కరిస్తూ, మారి పోతూ ఉంటుంది.”
ఇక స్త్రీ విషయం కూడా.. “పురుషుడితో నిజమైన స్నేహం ఏర్పడక పోవటం వల్లా, పురుషుడి నిరాదరణ వల్లా, స్త్రీ – పురుషుల మద్య తరచూ సంభవించే కలహాల వల్లా, ఒక పురుషుడి మీద ఏర్పడిన మోహం చచ్చిపోతూ ఉంటుంది. లేదా.. ఆ మోహం కొంత తగ్గి, మళ్ళీ కొన్ని కొత్త ఆశలతో ఇంకో పురుషుడి మీద మోహం కలుగుతూ ఉంటుంది.”
“స్త్రీలు తక్కువ, పురుషులు ఎక్కువ” అనే భావన పాతుకుపోయి ఉన్న సమాజంలో, ఒక మోహ సంబంధం అనేక అసంతృప్తులతో ఏర్పడుతుంది. అనేక సర్దుబాట్లతో, రాజీలతో, సరిపెట్టుకోవడాలతో, కొంత నచ్చీ, మరి కొంత నచ్చకా సర్దుబాటు పద్దతులతో ప్రారంభమవుతుంది.
లేదా, మొదట ఎక్కువ మోహం తోనే ఏర్పడినా, రాను రాను ఆ పరిస్థితి కూడా మారిపోతుంది.
దీనంతటికీ కారణం స్త్రీ – పురుషులు సమానులుగా లేక పోవటమే..”
“సమానులుగా లేని వారితో, (సామానులుగా లేని వారిలో) స్నేహం మొలకెత్తదు. స్నేహం లేని సంబంధం ఏదైనా, అది అసంతృప్తికే దారి తీస్తుంది.”
స్నేహం ద్వారా ఏర్పడిన ప్రేమలో.. తృప్తీ, సంతోషం, కలుగుతాయి. అప్పుడు ఇతర మోహ సంబంధాలతో అవసరం ఉండదు.
— రంగనాయకమ్మ
(Copied From:
వేంకట రాయ గారు..)
— Rajeshwer Chelimela , Jvv Telangana