పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు రాగానే అదేదో మన పవన్ కళ్యాణ్ ఈ పుణ్యం కట్టుకున్నాడని కొన్ని బ్యాచులు పనిగట్టుకుని మరీ ప్రచారం మొదలుపెట్టాయి. కొన్ని యూ ట్యూబ్ గొట్టం చానెళ్లు కూడా పాపం పవన్‌ను ఆకాశానికెత్తేందుకు సిగ్గు ఎగ్గూ లేకుండా మొగులయ్య నోటితోనే పవన్ కు కీర్తి కిరీటాలు పెట్టాలని తెగ ఆత్ర పడ్డాయి. అసలు మొగులయ్య మియాసాబ్ పాటతోనే పవన్‌కు పేరొచ్చింది. ఆ సినిమాకు హైప్ పెరిగింది. మొగులయ్య పాట తర్వాత వచ్చే పాట రోత. ఆ రిలిక్స్ ఘోరం. ఆ మ్యూజిక్ అధ్వానం. మొగులయ్యను తాము గుర్తించామని, తమ వల్లే ప్రపంచానికి తెలిశాడని ఏం బిల్డప్‌లిస్తున్నార్రా నాయన. మీరు ఇగ మారరు.