సంక్రాంతి అంటే ఏపీలో అదో పే .. ద్ద పండుగ‌. కోళ్ల పందాలు.. కొత్త సినిమాల కోళాహాలం.. కోట్ల వ్యాపారం. ఎక్క‌డెక్క‌డో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసుకున్నోళ్లంతా దాచిన సొమ్మంతా పండుగ‌కు వెచ్చించే సంద‌ర్భం. ఏడాదంతా ఒకెత్తు.. ఆ సంక్రాంతి సీజ‌న్ ఒకెత్తు. ప్ర‌తీ సంవ‌త్స‌రం సంక్రాంతి బ‌రిలో కొత్త సినిమాలు కాళ్ల‌కు క‌త్తిక‌ట్టుకున్న పందెం కోళ్ల‌లో బ‌రిలో దిగేందుకు రెడీగా ఉంటాయి. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, పెద్ద హీరోలు అట్లా ప్లాన్ చేసుకుంటారు కూడా.

ఇక అభిమానులైతే సంక్రాంతికి త‌మ అభిమాన హీరో సినిమా రిలీజ్ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. త‌ల్ల‌కిందులైంది. ఎందుకంటారా? క‌రోనా వ‌ల్ల‌నుకుంటున్నారా? కాదు. ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ల్ల‌. సినిమా రేట్ల‌ను మొత్తానికి మొత్తం కోసేసి త‌గ్గేంచేసి నేలబారు చేసేసి చ‌వ‌క‌బారు సినిమాగా మార్చి సినీ రంగాన్ని చాప‌లో చుట్టి మూసీలో విసిరేసినంత ప‌నిచేశాడు జ‌గ‌న్‌.

ఈ దెబ్బ‌కు ఈ సంక్రాంతికి కొత్త సినిమాల రిలీజ్ లేదు. పాన్ ఇండియా సినిమా గా అంద‌రి అంచ‌నాల‌ను పెంచిన త్రిపుల్ ఆర్ సినిమా కూడా ఏప్రిల్‌కు వాయిదా ప‌డింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ అని చెబుతున్నారు కానీ.. ఏపీ సినిమా రేట్లు కూడా ఓ కార‌ణ‌మే. ఇక మిగిలిన హీరోల సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. ప్ర‌భాస్‌, మ‌హేశ్‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. కానీ ఇవేవీ ఇప్పుడు రావు. ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌దు. జ‌గ‌న్ త‌న నిర్ణ‌యాన్ని ఎప్పుడు మార్చ‌కుంటాడో తెలియ‌దు. కానీ ఏపీ అభిమానుల‌కు మాత్రం ఈ సంక్రాంతి సీజ‌న్ కోళ్ల పందేలే లేని పండుగ‌లా వెలితిగా మార‌నుంది. సంక్రాంతి సినిమా మార్కెట్‌ను నిలువునా పాత‌రేసి చంపేశాడు ఏపీ సీఎం జ‌గ‌న్‌.