కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అప్పుడప్పుడు ఇలా వార్తల్లో నిలుస్తాడు. తనకు అందివచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో… ఒకవేళ వినియోగించుకుందామన్నా కేంద్రంలో తన మాట చెల్లుబాటు కాకనో తెలియదు కానీ, తన హోదాకు తగ్గట్టుగా ఆయన వ్యవహార శైలి, మాట తీరు ఉండదు. చివరకు సీఎం కేసీఆర్ చేత కూడా రండ మంత్రి అని తిట్టించుకున్నాడు. కేసీఆర్ అలా తిట్టడం తప్పే. కానీ అంతలా కోపం తెప్పించేలా కిషన్‌రెడ్డి వ్యవహరించడం. కేసీఆర్ ప్రష్టేషన్‌ను పెంచేసింది. అందుకే రండ అని పదం వాడాల్సి వచ్చినట్టుంది. యాసంగి వడ్లు, ధాన్యం, బాయిల్డ్ రైస్ విషయంలో ఇక్కడ బీజేపీ నేతలు ఏం చేయలేదు. వాస్తవానికి వీరితో ఏం కాదు. కానీ అబద్దాలు మాత్రం బాగానే వల్లెవేశారు.
ఎంపీలు, మంత్రుల దగ్గర నుంచి అంతా అదే బాట. వరి వేసుకోమంటారు. మేం వద్దన్నామా అంటారు. కానీ బాయిల్డ్ రైస్ తీసుకోమని చెబుతారు. కేంద్రం అలా అనలేదు… మీరు వరి వేయండి అని ఇక్కడ కిషన్ రెడ్డి సహా నేతలంతా అదే పల్లవి అందుకుంటారు.మొత్తానికి రైతులను ఎంత అయోమయానికి గురి చేసి అంతా చేశారు. చివరకు అటు ప్రభుత్వం మాట వినడం మానేశారు. ఇటు బీజేపీ నేతల మాటలు వినడం మానేశారు. వరే వేస్తున్నారు. నాట్లు జోరందుకున్నాయి. సరే, ఇది కాదు సంగతి కానీ.. మన కిషన్ అన్న సాయిధరమ్ తేజ్ ఇంటికి పోయి పరామర్శించడం ఇప్పుడు ముఖ్యమైన వార్తయి కూర్చుంది. ఎప్పుడో రెండు నెలల కిందట రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. అదీ తనే జారి కింద పడ్డాడు. అతి వేగమే ప్రమాదానికి కారణం. దీనిపై మీడియా కూడా ఓవర్ యాక్షన్ చేసి వాతలు పెట్టుకున్నది.
అంతా సైలెంట్ అయింది. ఇప్పుడు ఇది అతి ముఖ్యమైన పనిలా ఆకస్మాత్తుగా కిషన్‌రెడ్డికి జ్ఞాపకం వచ్చినట్టుంది. అనుకున్నదే తడువుగా హడావుడిగా సాయిధరమ్ తేజ్ ఇంటికి వెళ్లాడు. పరామర్శించాడు. దీన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. ఇంకేముంది.. ? కిషన్ అన్నను సోషల్ మీడియాలో అర్సుకుంటున్నారు. ఇంత కన్నా ఇంపార్టెంట్ పనేం లేదా కిషన్ అన్నా.. సరే పోతే పోతివి.. దాన్ని పోస్టు చేసి పదిమందికి చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటావా..? అని కూడా అడిగేస్తున్నారు. ఎవరేం అనుకుంటే తనకేం.. ఆయన అంతే…
