రొటీన్‌గా ఆలోచించడం సాధారణం. కానీ కొందరు వెరైటీగా ఆలోచిస్తారు. నలుగురిలో తన ప్రత్యేకతను చాటుకోవాలనే తపన వారిది. అందిరిలా ఒక్క చోట కుదురుగా ఉండనివ్వదు. తనకంటూ ఓ గుర్తింపు కావాలి. నలుగురిలో ఆకర్షణగా నిలవాలి. ఇదిలో ఇలాంటి తపనే వారిని భిన్నంగా ఆలోచించేలా చేస్తుంది. ఓ ఐడియా తళుక్కున మెరుస్తుంది. అది అందరినీ ఆకట్టుకుంటుంది. ఉనికిని నిలబెడుతుంది. కడుపు నింపుతుంది. ఉపాధికీ ఊతమిస్తుంది. అంతే మరి. అంతరిలా ఆలోచిస్తే అర్థమేముంది..? కొంచెం తేడాగా.. అదే కొంచెం భిన్నంగా ఆలోచించి చూడు.. ప్రపంచమే నీ దిక్కు చూస్తుంది. సాక్షి , నిజామాబాద్ ఫోటో గ్రాఫర్ రాజ్‌కుమార్‌కు వాస్తవం అభినందనలు.