నూతన జిల్లాల ప్రకారం ఉద్యోగుల విభజనకు తెలంగాణ ప్రభుత్వం 317 జీవో విడుదల చేసింది. ఇంతకాలం నిర్లిప్తంగా ఉండి నూతన జిల్లాలు ఏర్పడిన నాలుగేళ్ళ తర్వాత హడావిడిగా ఆఘమేఘాల మీద ఉద్యోగుల విభజనకు ప్రభుత్వం పూనుకుంది. ఉద్యోగుల మనోభావాలను అర్థం చేసుకోకుండా ఉద్యోగుల విభజనకు శ్రీకారం చుట్టింది.
- 317 జీవోలో ఉద్యోగుల విభజనకు సీనీయారిటీ ని ప్రాధాన్యత అంశం పరిగణలోకి తీసుకోనున్నట్లు ప్రకటించారు. స్థానికేతరులు వచ్చి మన అవకాశాలు కొల్లగొట్టుతున్నారన్న అంశాన్నే ప్రధాన అంజెండాగా తీసుకొని ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం. కానీ స్వరాష్ట్రంలో తమ మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
- 317 జీవోలో ‘స్థానికత’ అంశాన్ని విస్మరించడం తమ గొంతు కోయడమేనని సర్వీస్లో జూనియర్లుగా ఉద్యోగులు వాపోతున్నారు. సీనియారిటీ ప్రాధాన్యత అంశంగా తీసుకోవడం వల్ల సీనియర్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ పట్టణ ప్రాంతాలు కలిగి ఉన్న జిల్లాలను మాత్రమే ఎంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే జరిగితే సర్వీసులో జూనియర్లుగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు మారుమూల ప్రాంతాలకు బలవంతంగా నెట్టివేయబడుతారు.
- రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే స్థానికేతరులు 48శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 317 జీవో యథాతథంగా అమలు పరిస్తే రంగారెడ్డి జిల్లాలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వరంగల్ లాంటి జిల్లాలో కూడా ములుగు లాంటి ప్రాంతాలకు సర్వీసులో జూనియర్లుగా ఉన్న స్థానికేతర ఉద్యోగుల ములుగు లాంటి ప్రాంతాలకు బలవంతంగా పంపబడుతారు. ఈ సమస్య కేవలం నగర ప్రాంతంలు ఉన్న జిల్లాలలో ఈ ప్రభావం ఉంటుందని మొదట అందరూ భావించారు. కానీ ‘స్థానికత’ ప్రథమ ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు మొదలయ్యాయి.
- ఉద్యోగుల విభజనలో స్థానికత అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని ఉద్యోగులను విభజించాలని కోరుతూ ఎస్టీయూ, యూటీఎఫ్ సంఘాలు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిశాయి. మేడ్చల్ జిల్లా ఉపాధ్యాయులు మంత్రి చామకూర మల్లారెడ్డి కలిసి తమగోడును వెళ్లబోసుకున్నారు. రాష్ట్రంలో మొనగాని సంఘంగా చెప్పుకునే సంఘం ఇద్దరూ ఎమ్మెల్సీ లను కలిగి ఉండి ఈ విషయంలో ఉపాధ్యాయులను గాలికొదిలేసినట్లు కొంతమంది ఉపాద్యాయులు ఆరోపిస్తున్నారు.
- ఉపాద్యాయులు నుంచి శుక్రవారం ఒక్కరోజే ఆప్షన్ పామ్ తీసుకోవడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తాత్కాలికంగా తయారుచేసిన సీనియారిటీ జాబితాలు కూడా లోపభూయిష్టంగా ఉన్నట్లు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఎవరి మెప్పు కోసం ప్రభుత్వం ఇంత హడావుడి గా ఉద్యోగులను విభజిస్తుందో అర్థం కావడం లేదని బాధను వ్యక్తం చేస్తున్నారు.
- ఉద్యోగులెవరైన కోర్టు తలుపు తట్టిన ఉద్యోగుల విభజన పక్రియ ఆగకూడదనే ఒకే ఒక్క కారణంతో స్థానికత కలిగిన జూనియర్ ఉద్యోగులను బలిపెట్టడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ను స్పూర్తిని కాపాడుతూ ‘స్థానికత’ కలిగిన ఉద్యోగ ఉపాధ్యాయులు వారి జిల్లాలలోనే కొనసాగేవిధంగా 317 జీవోను సవరించాలని ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుతున్నారు