ఈ విష‌యం తెలిస్తే.. ఆర్జీవీ వెంట‌నే తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు క‌లుస్తాడు ఆల‌స్యం చేయ‌కుండా. మ‌రి ఆయ‌న‌కు మంచి సినిమా క‌థ దొరికిందిగా. సూరి, ప‌రిటాల ర‌వి నిజ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కించిన ర‌క్త చ‌రిత్ర‌లా.. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను హీరోగా పెట్టి.. ప్ర‌భుత్వాన్ని విల‌నీగా చూపిస్తూ ఓ మంచి క‌ల్పిత , హింసాత్మ‌క, ర‌క్త‌పాత‌.. క‌థ‌ను అల్లుకుని గోలిమార్ .. తీన్మార్.. అనే టైపులో త‌న‌దైన శైలిలో ఓ టైటిల్‌ను ఎంచుకుని అలా వార్త‌ల్లో మ‌రోసారి నిలిచి.. చ‌ర్చ‌కు తెర తీసి ఉండేవాడు.
https://vastavam.in/wp-admin/edit-comments.php

ఇది ఇంకా ఆర్జీవీ న‌జ‌ర్‌లో ప‌డ‌న‌ట్టుంది. లేదా ఈ రోజు రాత్రి ఓడ్కా తాగుతున్న స‌మ‌యంలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌.. ఏదో ఒక దాంట్లో వెంట‌నే అప్ప‌టికప్పుడు ఓ టైటిల్‌ను అనేసుకుని క్ష‌ణాల్లో అది ట్విట్ట‌ర్ గూట్లో పెట్టేస్తాడు ఏ అర్థ‌రాత్రికో. అస‌లు సంగ‌తేంటంటే… త‌న‌ను జైళ్లోనే చంపాల‌ని చూశార‌ని తీన్మార్ మ‌ల్ల‌న్న నిన్న ఏదో మీటింగులో అన్నాడు. అదీ గాంధీ జ‌యంతి రోజునే స్పాట్ పెట్టాల‌ని చూశారంట‌. కానీ కుద‌ర‌లేదంట‌. ఆ త‌ర్వాత చీక‌టి గ‌దిలో బంధించి ..పిచ్చోడిని చేసేంందుకు ఏవో మందులు కూడా తినిపించారంట‌. కానీ అదృష్టావ‌శాత్తు పిచ్చోడు కాలేదు.

ఈ మాట‌లు మ‌తి త‌ప్పే మాట్లాడుతున్నాడంటారా? అలా అయివుండ‌దు. కానీ .. ఒక్క డౌట్‌… జైళ్లోనుంచి విడుద‌ల కాగానే.. ఇదే విష‌యాన్ని, సీక్రెట్‌ను, కుట్ర‌ను, ప్ర‌భుత్వ ప‌న్నాగాన్ని నొక్కి వ‌క్కాణించి.. బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబితే.. ఎంత ప్ర‌చారం దొరికేది..? ఎంత వైర‌ల్ అయ్యేది..? ఎందుకింత ఆల‌స్యం అయింది. ఆ రోజు సంఘ‌ట‌న‌లు గుర్తుకు రావ‌డానికి ఏమైనా స‌మ‌యం ప‌ట్టిందా? పిచ్చి మందుల ప్ర‌భావం అప్ప‌టి వ‌ర‌కూ ఉండి.. ఇప్పుడిప్పుడే పోతుందా..?

You missed