.
మీడియా అయినా.. ప్రజలైనా.. ప్రముఖులైనా.. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు పెద్దగా స్పందన ఉండదు. దానికి మనమేం చేస్తాం. ఉడుత భక్తిగా ఏదో చేద్దాం.. వదిలేద్దాం..అంతే. రాజు అందరినీ పొద్దున్నే పాలు తీసుకొచ్చి ఓ కుండలో పొయ్యమన్నాడంట. నేనొక్కడిని పాలు పొయ్యకపోతే ఏందీ..? అందరూ తెస్తారు కదా.. నేను నీళ్లుపోస్తే అందులో కలిసిపోతాయి… అనుకుంటారు కొందరు. అలా అందరూ ఆలోచించి ఆఖరికి నీళ్లే పోశారంట. నీళ్లతో ఆ కాగు నిండిపోయింది. కరోనా వచ్చి ఎంతో మంది జీవితాలు ఆగమయ్యాయి. ఇంటి పెద్ద చనిపోతే పట్టించుకునే దిక్కులేదు. ప్రభుత్వం చూస్తుండిపోయింది.
మనమేం చేస్తాం. అది ప్రపంచ సమస్య అన్నట్టు. ఉపాధి లేదు. కడుపు నింపుకునేందుకు కూలీ లేదు. అలా ఆకలితో అలమటించే వారికి ఆదుకున్న వారు కొందరే.కానీ కొంత మంది ఉంటారు.. సెలబ్రెటీలతో ఉన్న సంబంధాలు ప్రజలతో ఉండవు. ఎందుకంటే ప్రజలు వెర్రి వెధవలు వారి దృష్టిలో. అందుకే బతకనేర్చిన వాళ్లు సెలబ్రెటీలతో కలుస్తారు.వారు ఎప్పుడు బాగుండాలని కోరకుంటారు. వారు బాగుంటేనే కదా… నాలుగు సినిమాలు తీసేది.. నాలుగు రాళ్లు వెనుకేసుకునేది. అందుకే ప్రజలు ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నా… ఒక్క మెసేజ్ ఉండదు. భరోసా మాటుండదు. మీమున్నామనే భరోసా ఉండదు. కానీ ఇలా చిన్న ప్రమాదం జరిగినా తొందరగా కోలుకోవాలని వేయి దేవుళ్లను కోరుకుంటాం. మేమంతే.