నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతూ వస్తున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భేషుగ్గా ఉంటాయని, మరింత మెరుగు పడ్తాయని భావించారు. కానీ పరిస్థితులు అందుకు పూర్తిగా విరుద్ధంగా తయారయ్యాయి. ఉద్యోగావకాశాలు అంతగా మెరుగుపడలేదు. నోటిఫికేషన్ల జాడలేదు. నిరుద్యోగుల ఎదురుచూపులు ఆగడం లేదు. ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదు.

నానాటికీ ఈ సమస్య మరింత జటిలంగా మారుతున్నది. నిరుద్యోగుల్లో ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడుతున్నది. ప్రతిపక్షాలు కూడా దీన్నే ప్రధానాస్త్రాంగా తీసుకుని ప్రజాక్షేత్రంలో పోరాటాల నిర్మాణాలు చేస్తున్నాయి.

ఓ అమ్మాయి విద్యావంతురాలు. బాగా చదువుకున్నది. కానీ ఉద్యోగం రావడం లేదు. ఉద్యోగం లేక నాలుగు బర్లు కొనుక్కుని వాటిని కాస్తున్నానని.. ఆ అమ్మాయి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. వెటకారంగా చేసిందో.. ప్రభుత్వం పై నిరసన తెలుపుతూ మాట్లాడిందో.. వాస్తవ పరిస్థితులను బయట ప్రపంచానికి తెలియజేయడానికి, లోలోన బాధపడుతూ నవ్వుతూ చేసిందో తెలియదు కానీ వీడియో మాత్రం నేరుగా గుండెకు తాకేలా ఉంది. ప్రస్తుత పరిస్థితులకు అద్ధం పట్టేలా ఉంది. పాలకుల విధానాలను తూర్పారబట్టేలా ఉంది.

 

You missed