సాయిధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడెలా ఉన్నాడు?

అత‌నికి కాల‌ర్ బోన్ ఆప‌రేష‌న్ అయ్యిందా? డిశ్చార్జి ఎప్పుడు చేశారు? ఇప్పుడెలా ఉన్నాడు?

అస‌లెవ‌రూ చెప్ప‌రేంది. ఈ టీవీ ఛాన‌ళ్ల‌కు ఏం రోగం పుట్టింది. యాక్సిడెంట్ అయిన‌ప్పుడు క్ష‌ణ‌క్ష‌ణం వార్త‌లిచ్చి నిద్ర‌లేకుండా చేశారు. ఇప్పుడు ఏమైందో కూడా చెప్పాలె క‌దా. ఓరేయ్‌..! ఇక్క‌డ న‌రాలు చిట్లిపోతున్నాయ్‌.. రా. జ‌ర మీకు పుణ్య‌ముంట‌ది .. అత‌నెలా ఉన్నాడో జ‌ర చెప్పండ్రా..!

 

రేపిస్టు రాజుగాడు చ‌చ్చిండు క‌దా. జ‌ర ఇటు ఫోకస్ పెట్టండిరా. ఆ ప‌ట్టాల మీద‌కెళ్లి దృష్టి ఇటు డైవ‌ర్టు చేసి… కెమెరాలు సాయిధ‌ర‌మ్ తేజ్ ఇంటి గేటు కాడ పెట్టి లైవ్ లివ్వండిరా .. ఒక్క‌సారి ఆ హీరో మాట్లాడితే చూడాల‌ని ఉందిరా బ‌డుద్దాయ్ లారా..! మీ రేటింగులు ప‌డిపోను…! మీ కెమెరాలు విరిగిపోను..!!

ఒక్క‌డంటే ఒక్క‌డు కూడా మా మెగా హీరో వైపు చూడటం లేదేందిరా?
సోష‌ల్ మీడియాలో ప‌డ్డ అక్షింత‌ల‌కు జ‌డుసుకున్నార్రా వెధ‌వ‌ల్లారా?
వాళ్ల‌కేం తెలుసురా.. సెల‌బ్రిటీల గురించి తెలుసుకోవ‌డానికి జ‌నం ఎంత ఆస‌క్తి చూపుతారో..!
ఎవ‌డో ఏదో కూశాడ‌ని, సాయిధ‌ర‌మ్ తేజ్‌ను అనాథ‌ను చేస్తార్రా బ‌డ్వేగాల్లారా..!
మీ టీవీ ఛాన‌ళ్లు నాశ‌నం గాను..! మీ గొట్టాలు విరిగిపోను..!!

మీకూ యాక్సిడెంట్లు అవుతాయిరా..
మీ కాల‌ర్ బోన్లూ విరుగుతాయిరా…
ఇదే మా అభిమానుల శాపం… మీరు బాగుప‌డ‌ర్రోయ్‌… నాశ‌న‌మైపోతారు. మా హీరో ఉసురు త‌గిలి.

You missed