కేసీఆర్ అంటే ఎంతో అభిమానం ఆయనకు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నోడు. పోరాటాల్లో పాల్గొన్నోడు. అందరిలా కేసీఆర్‌కు గుండెలో గుడి కట్టలే. ఏకంగా తన ఇంటి ముందే రెండు లక్షల వరకు ఖర్చు కేసీఆర్‌కు గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రతి పుట్టిన రోజున ఆ గుడి వద్ద అన్నదానాలు చేసేవాడు. పూజలు నిర్వహించేవాడు. తన అభిమానాన్ని చాటుకునేవాడు. కానీ తన అవసరానికి మాత్రం టీఆరెస్ ఏ విధంగానూ ఉపయోగపడలేదు. దీంతో ఓ దశలో విరక్తి చెందాడు. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకులేదు. తిక్కరేగి ఇప్పుడు ఈ గుడిని అమ్మకానికి పెడుతున్నట్టు ప్రకటించేశాడు. తన కుటుంబాన్ని పోషించేందుకు కష్టంగా ఉందని చెప్పాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన గుండా రవీందర్ వైశ్యుడు.కేబుల్ నెట్‌వర్క్ ను నడుపుకుంటున్నాడు. ఉద్యమంలో మొదటి నుంచీ ఉన్నాడు. కేసీఆర్‌కు గుడి కడితే ఇక తనకు తిరుగులేదనుకున్నాడో.. లేదా అంతా వచ్చి తనకు సాయం చేసి ఆకాశానికెత్తుతారని ఆశపడ్డాడో తెలియదు కానీ.. ఖర్చు పెట్టి గుడి కట్టాడు. రెండెకరాలు కూడా అమ్ముకున్నానని కూడా చెప్పాడు. దేనికో చెప్పలేదు. తనకున్న కేబుల్ నెట్ వర్క్ ను ఎవడో రౌడీ వచ్చి ఆక్రమించాడట. ఎమ్మెల్యేకు చెబితే పట్టించుకోలే. ప్రగతి భవన్‌కు వెళ్లి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినా పట్టించుకోలేదు. ఐదు నెలల కింద టీఆరెస్‌కు గుడ్‌బై చెప్పాడు. బీజేపీలో చేరాడు. ఇప్పడు ఇక కేసీఆర్‌తో , కేసీఆర్ గుడితో ఏం పని ఉంది. అమ్మకానికి పెట్టాడు. తర్వాత రోజుల్లో మోడీ గుడి కడ్తాడు కావొచ్చు. అప్పుడైనా బీజేపీ నేతలు పట్టించుకుంటారో లేదో..?