నేను చెప్తూనే వున్నాను ….అంతంత రేట్లకి అమ్మకండిరా, రేపు ఎవరొకరికి కన్ను కుడుతుంది మీ మీద అని.విన్నారు
కాదు.ఇపుడు చూడండి.ప్రభుత్వానికే కన్ను కుట్టింది.మా బాగా అయ్యింది.మంచి ప్రోటీన్ ను ఇచ్చే తొక్క లేని కోడి మాంసం కేజీ 300 రూ.లోపు,ఒమేగా రిచ్ చేపలు కేజీ రూ. 400 లోపు,నోట్లో పెడితే కరిగిపోయే రొయ్యలు kg 500 రూ.లోపులోనూ ఉంటే ,కోలస్ట్రాల్ కి బ్రాండ్ అంబాసిడరు, పరిమాణంలో సగానికి పైగా బొమికలతోనే నిండిన మటన్ కేజీకి 1000 రూ.ధర పలికేస్తుంటే పాపం ప్రభుత్వం కూడా ముచ్చటపడి ఈ వ్యాపారంలోకి దిగుతోంది.మొన్నామధ్య కలెక్టర్లు ఉల్లిపాయలు అమ్మ లేదూ.ఇదీ అలానే.అలా అని ఇదేమీ కొత్త కాదు.మన ప్రభుత్వ పశువుల ఆస్పత్రులలో సీమ పంది మాంసాన్ని అమ్మేవారు మా చిన్నప్పుడు,మరి ఇపుడు అమ్ముతున్నారో లేదో నాకు తెలియదు కానీ.

మన అదృష్టం కొద్దీ మన దేశంలో నాణ్యమైన విద్య,వైద్యం ప్రైవేటు రంగంలో చాలా చౌకగా, కొన్నిచోట్ల ఉచితంగానే దొరికేస్తోంది కాబట్టి ,ప్రభుత్వం ఖాళీగానే పడున్న ప్రభుత్వ విద్య, వైద్య సంస్థలను మూసివేసి ఇలా ఖరీదైన, ప్రజలకు భారమైన మేక మాంసం , పులస పులుసు,పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లు,సీతాఫలాపళ్ళు వంటివి మన ప్రభుత్వ ఉద్యోగులతో అమ్మిస్తే ఎంతో బెటర్.అలానే మా కాకినాడ లో ప్రతి వంద అడుగులకు ఒకటి వుండే స్వీట్ స్టాల్స్ పైన కూడ దృష్టిని పెట్టి వాటినన్నిటినీ జాతీయం చేసేసో,లేక ప్రభుత్వమే తన స్వంత దుకాణాలు తెరిచేసో ప్రజలకు నాణ్యమైన,రుచికరమైన గొట్టం కాజాలు బాగా సరసమైన ధరలకు అందించే ఏర్పాట్లు కూడా చేయాలని నా కోరిక !!!

Raghu Srimanthula

You missed