ఆర్మూర్‌లో దళితబంధు అమలు పై అనుమానాలు వ్యక్తంచేశారు దళితులు.
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మార్పీఎస్ నాయకుడు మైలారం బాలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టిందని, ఇది ఎన్నికల కోసం పెట్టిన పథకం అని తెలిపాడు. గతంలో సీఎం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ఎన్నికల కోసం పెట్టిన పథకం అని మందకృష్ణ ప్రశ్నించారని, ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వ్యాపార రంగంలో రాణిస్తున్నారని, వ్యాపారం మీదున్న శ్రద్ధ ప్రజల పట్ల లేదని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వ్యాపారం చేసుకోవాలని సూచించాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి దళితబంధు పథకం వస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నామని, గతంలో దళిత ఉద్యోగులను హత్య చేసిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కి రెండోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని పేర్కొన్నాడు. ఆయన పై జరిగిన సీబీసీఐడీ విచారణ ఎందుకు బట్టబయలు కావడం లేదని మండిపడ్డాడు. దళితబంధు పథకం పై చిత్త శుద్ధి ఉంటే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పై విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. ఆర్మూర్‌లో ఉన్న వేల మందికి ఉపాధి కల్పించే తోలు పరిశ్రమను తెరిపించడంలో జీవన్‌రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని, దళితులంతా హత్య విషయంలో ప్రశ్నించడం వల్లే దళితులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాడని పేర్కొన్నాడు. ఆర్మూర్‌లో అంబేద్కర్ భవనం నిర్వహించడం లేదని మండిపడ్డాడు. జీవన్‌రెడ్డి దళిత ద్రోహి అని, తలారి సత్యం హత్య విషయంలో ఎమ్మెల్యేను జైలుకు పంపించేంత వరకు ఎమ్మార్పీఎస్ నీడలా వెంటాడుతుందని హెచ్చరించాడు
