విలేకరుల మీద కేసులు మాఫ్ జేస్తడట.. బడి పిల్లల బ్యాగుల మీద ప్రతిపక్ష నాయకుల ఫోటోలు ఉండనిస్తడట. పాలాభిషేకాలు, మెప్పుకోళ్లు ఒప్పుకోడట. అఖిలపక్షాల సమావేశాలు బెట్టి సమస్యలుపరిష్కరించే మార్గం అడుగుతడట.. నాకు దెలువని శాన తప్పులే చేస్తాండట. ఓ పండుగ లేదు.. ప్రవోజనం లేదు. దావతులేదు. దస్కత్ లేదు. పురాంగ చెడగొడుతాండు ప్రజాస్వామ్యాన్ని.
గీనేమి ముఖ్యమంత్రి.
ఇదెక్కడి కథ.అసలు నాయకుడేనా గీయినె.
ముఖ్యమంత్రి అంటె ఎంత ఖదర్ గుండాలె. నచ్చినోని మీటింగులకు పర్మిషన్ ఇయాలె. నచ్చనోణికి నిర్బంధం రుచి జూపాలె. అఖిలపక్షం అంటె ప్రజలు మరిచిపొయ్యే దినాలు దేవాలె.
ప్రజాస్వామ్యం అంటె తెలువనోళ్ళను ముఖ్యమంత్రిని జేస్తె ఇప్పుడు తమిళ నాడు లెక్కుంటది. నలుగురు జూడ నగుబాట్లయ్యేటట్టున్నది అక్కడ.
ఉత్తర ప్రదేశ్ లెక్కనో, ఇంకో కాడి లెక్కనో నాయకులు ఉండాలె. సర్వేలు జేపించుకోని గెలుస్తారని చెప్పించుకోవాలె.
స్టాలిన్ లెక్కుంటె మాత్రం ఇగెక్కడి ప్రజాస్వామ్యం.
P V Kondal Rao