నిజమాబాద్ రాజకీయాలు ఎప్పుడూ చర్చకు కేంద్ర బిందువుగా ఉంటాయి. సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యడు ధర్మపురి శ్రీనివాస్ ఇద్దరు తనయులు ఇప్పుడు తలో పార్టీలో ఉన్నారు. ప్రస్తుతానికి టెక్నికల్‌గా డీఎస్ టీఆరెస్ రాజ్యసభ సభ్యుడు. చిన్న కుమారుడు అర్వింద్ బీజేపీ నుంచి గెలుపొందిన నిజామాబాద్ ఎంపీ,పెద్ద కుమారుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ..మొన్నటి వరకు తండ్రితో పాటు టీఆరెస్‌లో ఉన్నా.. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా అయిన తర్వాత కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యాడు. పార్టీలో ఇంకా అధికారికంగా చేరకపోయినప్పటికీ.. నేడో రేపో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు మాట్లాడాడు. నీకిది లాస్ట్ వార్నింగ్. ఆ తర్వాత మాటలుగీటలు ఏముండవ్.. అంటూ డైరెక్ట్‌గా తమ్ముడు అర్వింద్‌కు వార్నింగ్ ఇచ్చాడు. తమ్ముడు మాట్లాడే భాష బాగాలేదని, ప్రతీ దానికి తాము కౌంటర్ ఇచ్చుకోవాల్సి వస్తుందని, లేదంటే జనాలు మేమంతా ఒక్కటేనని భ్రమపడే పరిస్థితి ఉందన్నాడు. అసలు చేసిందేమీ ఏమీలేక ఎప్పుడూ మంది మీద పడి తిడుతూ ఉంటాడని, ఈ బీజేపీయే ఇంతని ఘాటుగా స్పందించాడు…