ఈటల రాజేందర్ కష్టపడి పైకొచ్చిన నేత. ఉన్నత పదవులు అలంకరించి బీసీ నేతగా మంచి గుర్తుంపు తెచ్చుకున్న నాయకుడు. సీఎం కేసీఆర్‌కు నమ్మిన బంటు మొన్నటి వరకు. కానీ ఇప్పుడు పరిస్తితులు తారుమారయ్యాయి. అవమానకర రీతిలో ఈటలను మెడలు పట్టి బయటకు గెంటేశాడు కేసీఆర్. అయితే అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు ఈటల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనపై కొంత సానుభూతి కూడా ఉంది. కానీ తాను అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా కొనసాగిన సందర్భంలో తన వద్దకు వచ్చిన వారితో అహంకారపూరితంగా మాట్లాడటం చాలా మందికి నచ్చలేదు. అప్పట్లోనే ఈటల ఇలాంటి దోరణిపై చాలా మంది అసంత్రుప్తిగా మాట్లాడారు. ఈయనకు చాలా గర్వం… ఈటల ఓ అహంకారి… అనే అపవాదును మూటగట్టుకున్నాడు. అప్పుడు ఈటల రాజేందర్ ఏమి చేసిన చెల్లుబాటయ్యింది. ముఖం ముందు చెప్పేందుకు కూడా భయపడేవారు. కానీ ఇప్పుడు అందరి మద్ధుతు కావాలి. అదే పనిలో ఉన్నాడు ఈటల. తాజాగా మందక్రిష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈటల దళిత ద్రోహి అని మందక్రిష్ణ విమర్శించాడు. ఆయనో స్వార్థపరుడని, దళితులను అవహేళన చేస్తూ మాట్లాడడని గతంలో జరిగిన ఉదంతాలను ముందుంచాడు. ఇపుడు ఇది కొన్ని కులాల సెక్షన్లలో చక్కర్లు కొడుతున్నది. చాలా మందిని కూడా ఇదే విధంగా ఆయన తనదైన దోరణిలో మాట్లాడాన్ని ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఓ వైపు అధికార పార్టీ అన్ని వైపుల నుంచి ఈటల పై ముప్పేట దాడికి దిగుతున్న తరుణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి కూడా ఆయనకు తగిన సహాయ సహకారాలు అందుతున్నాయా? వారంతా సహకరిస్తారా? అనేది చూడాలి.
Related Post
ఆత్మగౌరవం అప్పుడు ఎర్రవల్లికి.. ఇప్పుడు ఢిల్లీకి! కేబినెట్ మీటింగులపై కవిత చురకులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.. రేవంత్ రెడ్డి మాటిచ్చాడు మరిచాడు..! తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కవిత డిమాండ్ 24న చలో సెక్రటేరియట్‌కు జాగృతి మద్దతు
Feb 19, 2026
Dandugula Srinivas
