బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర్న‌లిస్ట‌ల‌కు ఇండ్లు నిర్మించి ఇస్తున్నాడంట‌. ఇది చూసి అబ్బుర‌ప‌డ్డ మ‌న జ‌ర్న‌లిస్టు సంఘం నేత‌, అంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిర‌ణ్ .. అద్బుత‌మ‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. ఆ ఫోటోలు త‌న ఫేస్‌బుక్కులో పెట్టుకున్నాడు. ఇది ఆద‌ర్శ‌మ‌ని అన్నాడు. కానీ అంత‌టా ఇలా క‌ట్టించండ‌ని ప్ర‌భుత్వాన్ని అడిగే ధైర్యంచేయ‌లేక‌పోయాడు. ఎంతైనా ఎమ్మెల్యే క‌దా. కానీ అంత‌టా ఇలా క‌ట్టించే అవ‌కాశం ఉంద‌ని మాత్రం అనిపిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. జ‌ర్న‌లిస్టులు ఎలాగూ ఆశాజీవులు, అల్ప‌సంతోషులు. నేత‌ల మాట‌లు వింటూ వ‌చ్చారు. వ‌స్తున్నారు. అలాగే పోతారు. కానీ ఇండ్లు మాత్రం రావు. క్రాంతి కూడా ఓ లీడ‌రే క‌దా. అచ్చం లీడ‌ర్‌లాగే మాట్లాడి వెళ్లాడు. స‌న్మానం కూడా చేపించుకున్నాడు. పెద్దనేత‌ల‌కు చెప్పే ధైర్యం లేక‌పోయినా.. ఆ సాహ‌సం చేయ‌క‌పోయినా.. కింద వారి పేర్ల‌ను ప్ర‌స్తావించాడు. ప‌రోక్షంగా .. చూడండి సారు.. ఇలా చేస్తే బాగుంటుంద‌ని. సంతోషం చంట‌న్న‌.

ఫేస్‌బుక్కులో క్రాంతి పెట్టిన పోస్ట్‌….

 

జర్నలిస్టుల ఇండ్ల కలలను సాకారం చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి జర్నలిస్టుల తరపున ధన్యవాదాలు…. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో విశాలమైన రహదారులు, అంతర్గత రోడ్లతో 57 మంది జర్నలిస్టులకు ఇళ్లను నిర్మించడమే గాకుండా, దానిని ఒక అందమైన కాలనీగా రూపొందించిన స్పీకర్ గారి కృషి అభినందనీయం. వారికి ధన్యవాదాలు. బాన్సువాడ తరహాలోనే నియోజకవర్గంలో ని అన్ని మండలాల్లోనూ జర్నలిస్టులకి ఇండ్లు నిర్మించడం పోచారం గారికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం… బాన్సువాడలో నిర్మించిన జర్నలిస్టుల కాలనీ రాష్ట్రానికంతటికీ ఆదర్శం… వారి స్ఫూర్తితో రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే తరహాలో ఇండ్లు రూపుదిద్దుకోవడం ఖాయమని పిస్తోంది.

#KCR #KTR #CMO #HarishRao #TRSparty #andolemla #chantikranthikiran

You missed