నిజామాబాద్-2 డిపో కండక్టర్ సుధాకర్. ట్రిప్పుల మీద ట్రిప్పుల డ్యూటీ. మధ్యాహ్నం తినేటైం ఎప్పుడో అయిపోయింది. కానీ తినే తీరికలేదు. డ్యూటీ అలాంటిది. సాయంత్రం దాటిపోతున్నది. కడుపులో ఆకలి కేకలు పెడుతున్నది. ఇక లాభం లేదనుకుని రన్నింగ్ బస్సులోనే టిఫిన్ బాక్సు ఓపెన్ చేశాడు. గబా గబా బుక్కలు కలిపి తినసాగాడు. ఇది చూసిన ప్రయాణికులు .. ఎంది సార్ ఇంకా తినలేదా? అన్నారు. లేదన్నాడు. ఆ కండక్టర్ తింటుంటే.. ఆయనకు సహాయం చేశారు. అన్నంలో పప్పు వడ్డించారు. ఆ కదులుతున్న బస్సులోనే గబగబా తినేసి.. మళ్లీ టికెట్.. టికెట్ అన్నాడు సుధాకర్.
