(దండుగుల శ్రీనివాస్)
Dandugula Srinivas
8096677451
రాజకీయ జీవిత చరమాంకంలో ఘోర, దీన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది సుదర్శన్‌రెడ్డికి. అతను సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ మంత్రి. అంతకు మించి సీఎంకు సన్నిహిత బంధువు కూడా. రెడ్డి కాంగ్రెస్‌లో ఆ తోకనే కలిసి వస్తుందనుకున్నాడు. తప్పుకుండా తనకు మంత్రి పదవి ఖాయమని రోజులు లెక్కిస్తున్నాడు. నేడు, రేపు అంటు ఎదురుచూస్తున్నాడు. కానీ ఆ రెడ్డి కీరిటం కాలేదు కదా ముళ్ల కిరీటమై కూర్చుంది. రెడ్ల కాంగ్రెస్‌లో ఇక రెడ్లకు స్థానం లేదు అని అధిష్టానం తెగేసి చెప్పేసిన దరిమిలా రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆయన పేరు లేదు. ఇక మిగిలిన మూడు స్థానాల్లో కూడా ఆయన పేరు ఉండబోదని తెగేసి చెబుతున్నాయి ఏఐసీసీ వర్గాలు.
అంటే.. ఇందూరు జిల్లాకు మంత్రి ప్రాతినిథ్యమే ఉండదా..? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఉండకపోతే ఎట్లా..? అని అనుకోవచ్చు. ఈ సమీకరణతోనే ఎంతో ధీమాగా ఉన్నాడు మొన్నటి వరకు సుదర్శన్‌రెడ్డి. కానీ .. అది తలకిందులైంది. మంత్రివర్గంలో రెడ్లు ఎక్కువ కావడం ఒక కారణమైతే.. జిల్లాకు పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్‌కు అధిష్టానం అవకాశం కల్పించింది. దీంతో అంత పెద్ద పోస్టు ఇచ్చిన తరువాత ఇక జిల్లాకు ప్రత్యేకంగా ఓ మంత్రి అవసరం లేదనే భావనకు అధిష్టానం వచ్చేసింది.
దీంతో నిజామాబాద్ జిల్లాకు గతంలో కనివినీ ఎరుగని రీతిలో మంత్రి ఉండడన్న మాట. పాపం సుదర్శన్‌రెడ్డి… ఏదో లాస్ట్ సారి. .ఓ సారి మంత్రి అయి ఇక రాజకీయ జీవితాన్ని ముగిద్దామనుకున్నాడు. కానీ ఆ ఆశ నేరవేరకుండానే ఆయన జీవితాన్ని… సారీ.. రాజకీయ జీవితాన్ని ముగించేసింది అధిష్టానం.