(దండుగుల శ్రీనివాస్)
నిజంగా చెప్పాలంటే రేవంత్ నోరు జారాడు. నన్ను కోసినా ఏం చేయలేను. కోసుకుని తింటారా…? అని ఆయన మాట్లాడిన తీరు ఉద్యోగులను బాధించడమే కాదు.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకుని ఏరికోరి తెచ్చుకున్న సర్కార్ ఇలా చేస్తుందేమిటని విపరీతంగా బాధపడిపోయారు. సీఎం మాట్లాడిన తీరు ప్రభుత్వానికి కూడా తీవ్ర నష్టం చేకూరుస్తుందనే సమాచారం సీఎంకు అందింది. దీనిపై అధిష్టానం కూడా మందలించినట్టుంది. అందుకే ఇవాళ జరిగిన కీలక కేబినెట్ మీటింగులో మొత్తం ఉద్యోగుల గురించే చర్చించినట్టుంది. వారి గురించే నిర్ణయాలు తీసుకున్నట్టుంది. ఈ మీటింగే వాళ్ల గురించి పెట్టినట్టుంది.
అంతకు మించి పెద్దగా ఏం మాట్లాడలేదు. నిర్ణయాలు తీసుకోలేదు. ఏవేవో ఊహించారు కానీ, ఏమీ లేదు. అంతా తుస్సుమనిపించారు. ఉద్యోగులు మాత్రం హ్యాపీ ఇదీ కేబినెట్ ముచ్చట