మీలో ఎవరు కోటిశ్వరుడులో ఇందూరు టాలెంట్‌ను ప్రదర్శించి ఈ గేమ్‌షోలో మొట్టమొదటి సారిగా 12.50 లక్షలను గెలుచుకొని ట్రెండ్‌ను సృష్టించింది. నిజామాబాద్ జిల్లా నందపేట మండల కేంద్రానికి చెందిన అనురాధ ఈ గేమ్‌షోలో పాల్గొనే అవకాశం దక్కింది. తల్లిదండ్రులు సత్యసాయి బాపు రాజు, విజయ లక్ష్మి, భర్త వేణు డిఫెన్స్‌లో ఉద్యోగం. భరత నాట్యంలో మంచి ప్రతిభ కలిగి ఉన్నఅనురాధ పలు వేదికల మీద నాట్యాన్ని ప్రదర్శించింది. మొత్తం పన్నెండు ప్రశ్నలకు అవలీలగా సమాధానాలిచ్చింది. చివర వరకు తనకున్న మూడు లైఫ్‌లైన్లను కూడా ఉపయోగించుకున్నా.. ఎక్కడా పెద్దగా తడబడలేదు. ఆత్మవిశ్వాసంతో ఆడింది. జూ.ఎన్టీఆర్‌తో సమానంగా ఉత్సాహంగా పాల్గొని అడిగిన ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలిచ్చింది. పదమూడో ప్రశ్నగా అడిగిన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన మొట్టమొదటి మాజీ ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయింది. వీడియో కాల్ ఆప్షన్ ద్వారా నిజామాబాద్ కు చెందిన తన ఫ్రెండ్ శ్రీలేఖ సహాయం తీసుకున్నది. కానీ ఆమె తప్పు ఆన్సర్ ఇచ్చింది. కరెక్టు ఆన్సర్ భీంసేన్ సదార్.