Dandugula SRINIVAS
పాపం… ఇగ నుంచి గులాబీపార్టోళ్లు కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత అననీకే దడుచుకుంటరు. ఆ ఒక్కమాటన్నుందుకు మల్లా అర్సుకున్నడు రేవంతు. ఏకంగా బహిరంగ సభల్నే ఇష్టమొచ్చినట్టు పొట్టుపొట్టు తిట్టిన తిట్లకే చెవులు మూసుకోవాల్సి వచ్చింది హరీశుకు. నీయవ్వ అనవసరంగా అని అనిపించుకున్నట్లైంది లే అనుకున్నడు. ఆ ఫామ్‌హౌజ్ ల ఉన్న కేసీఆర్ కు కూడా భగ్గ కోపమే ఒచ్చుంటది హరీశుపైన. అరే ఉన్నకాడుండక. మధ్యన నా ముచ్చటెందుకు తీసినవ్ రాబై. తీస్తే తీస్తివి. జాతిపిత గీతిపిత గీ పీతల లొల్లెందుకురా నీకు. ఇప్పుడు గీవి అవసరమా..? అని కస్సున లేచుంటడు.
ఒక్క మాట జాతిపితన్నందుకు. తాగుబోతన్నడు. వందల ఎకరాల్లో కట్టుకున్న ఫామ్‌హౌజ్ ల పన్న అన్నడు. లక్ష కోట్లు సంపాదించన అన్నడు. గా క్యాప్సికం పండిస్తే కోట్లొస్తయన్నవ్ కదా గా ముచ్చట చెప్పు జెర మా పోరలను పంపుతా అని జనం ముందట ఇజ్జత్ తీసిండు కదరా హరీశు. అని శానా బాధపడి ఉంటడు గులాబీ జాతిపిత. అయినా రేవంతు. అంటే అన్నా అంటవ్ గానీ. సీఎంను పట్టుకుని ఇట్ల అంటర. బట్టలిప్పి కొడతానంటివి. మరి మాజీ సీఎంన పట్టుకుని నువ్విట్ల అనొచ్చున. అరె తాగనోడువున్నడు బై. జరంత పొద్దుగూకంగ తాగుతుండొచ్చు. గాయింతదానికి తాగుబోతోడు. మందు వాసన చూడందే నిద్ర లేస్తడా..? అరె గింత అన్నాళమా మరీ. ఇట్ల అనుడేంది బై.
ఇది ఇంట్రవెల్ మాత్రమే.. సినిమా చూపిస్త మామ అంటున్నవ్. ఇంకెన్ని దినాలు గీ ముచ్చట జెప్తవ్ బై. నువ్వు జూపిచ్చే సిన్మల ట్విస్టులేమీ లేవు. అంత ఉత్త ముచ్చట్లేనని ప్రేక్షకులకు సమజైపోకముందే అబీ క్లైమాక్స్ బాకీ హై అని ఊరంచకు ఇగ. లేకపోతే గీ సిన్మ అట్లర్ ప్లాపయిద్దిమల్లా.