(దండుగుల శ్రీనివాస్)
అప్పుడు చేరదీశారు. నెత్తికెత్తుకున్నారు. పెంచి పోషించారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇచ్చి సత్కరించుకున్నారు. ఊరేగారు. చట్టాపట్టాలేసుకు తిరిగారు. ఇప్పుడు ధిక్కరించారు. సస్పెండ్ చేశారు. ఏకంగా నిండు సభలో వాడో తిక్కలోడు అనే విధంగా అర్థమొచ్చేలానే ప్రవర్తించారు. బీసీ రిజర్వేషన్లు, కులగణన విషయంతో తీర్మాన్ మల్లన్న చెప్పిన మాటలు పట్టుకుని మీరు ఆగం అయి.. జనాలను తప్పుదోవ పట్టించే యత్నాన్ని తిప్పికొట్టే యత్నంలో మల్లి నిజస్వరూపం ఇది అనే విధంగా సీఎం ప్రసంగం కొనసాగింది.
అప్పుడు మీ కుటుంబంపై మీ పై కూడా ఇంతకు మంచి ఏదేదో మాట్లాడాడు. వాటిని ఒప్పుకుంటున్నారా..? నిజాలేనా..? నమ్ముతున్నారా..? అందర్నీ నమ్మమంటున్నారా..? అయితే వాటిని అన్నీ తెచ్చి ఇక్కడ సభలో ప్రదర్శించండి.. వాటిని అంగీకరిస్తున్నట్టు ఒప్పుకోండి.. అప్పుడు అతగాడు చెప్పిన బీసీ వాదన గురించి మా తప్పుల గురించి మాట్లాడండని సీఎం చెప్పడం…ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్టు… మీ ఎమ్మెల్సీ, మీ మనిషి, మీ పార్టీ అనే వాదనకు, తీన్మార్ మాటలకు అంత సీన్ లేదు.. వాడో తిక్కలోడు. అప్పుడు మీ గురించి .. ఇప్పుడు ఈ ఇష్యూ గురించి రెండూ పసలేనివేనని తేటతెల్లం చేయడం.
బీఆరెస్‌ను సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేసినట్టుగానే ఉంది ఈ విషయంలో మాత్రం.