అనుకోకుండా.. టైంపాస్‌గా.. నాచుర‌ల్‌గా..

ఎలాంటి మొహమాటం లేకుండా .. తొణుకుబెణుకు లేకుండా.. స‌ర‌దాగా.. ఆడింది.. పాడింది..

త‌న‌తో కొత్త జీవితం పంచుకునే తన భాగ‌స్వామితో క‌లిసి ఆడింది. త‌న‌కున్న ప్ర‌తిభ‌ను డ్యాన్స్ రూపంలో అన్య‌ప‌దేశంగా అవ‌లీల‌గా ప్ర‌ద‌ర్శించి అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది.

ఆమే.. బుల్లెట్ బండి.. సాయి శ్రియ‌. అస‌లు పేరు ప‌య్యావుల సాయి శ్రియ‌.

ఆమెలోని ప్ర‌తిభ‌ను దాచుకోలేదు. సిగ్గు, బిడియం ప‌క్క‌న‌బెట్టింది. చ‌నువు, చొర‌వ‌తో స్టెప్పులేసింది.

సాయి శ్రియ‌లోని ఆ ప్రత్యేక‌తే అంద‌రిలో ఒక‌రిగా నెల‌బెట్టింది. ఆమె జీవితానికి ఓ కొత్త బాట కూడా వేసింది.

బుల్లెట్ బండి పాటను నిర్మించిన బ్లూ రాబిట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ త‌మ త‌దుప‌రి పాట‌లో డ్యాన్స్ చేసే అవ‌కాశాన్ని సాయి శ్రియ‌కు ఇచ్చింది. ప్ర‌ముఖ గాయ‌ని మోహ‌న భోగ‌రాజు పాడిన ఈ పాట ఒరిజిన‌ల్ సాంగ్ క‌న్నా.. సాయి శ్రియ చేసిన డ్యాన్స్‌తోనే ఎక్కువ పాపుల‌ర్ అయ్యింది.

కంగ్రాచ్యులేష‌న్ సాయి శ్రియ‌. మ‌రిన్ని మెట్లు ఎక్కాల‌ని…..

You missed