(దండుగుల శ్రీ‌నివాస్‌)

బాల‌య్య సినిమాలో డైలాగులా ఉంది ఇది. కానీ రివ‌ర్సులో. నీ ఇంటికొచ్చా.. నీ న‌ట్టింటికొచ్చా.. నీకు మూతి మీద మొలిచిన మీస‌మే అయితే .. నువ్వు మగాడివే అయితే.. రా చూస్కుందాం..! అన్న‌ట్టుగా … ఇక్క‌డ రివ‌ర్సులో రేవంత్‌కు కేటీఆర్ స‌వాల్ విసిరాడు. రా .. నా ఇంటికి రా… న‌న్ను అరెస్టు చెయ్‌… ! నేనేడికీ పోలే.. ఈడ‌నే ఉన్నా.. నీ కోసం చూస్తున్నా.. అని ట్వీట్ చేశాడు. అంతే కాదండోయ్‌.. మ‌గ‌ధీర‌లో రామ్‌చ‌ర‌ణ్ డైలాగు ఉంది క‌దా… వంద మందిని ఒకేసారి పంపించు… ఎక్కువైనా ప‌ర్లేదు.. లెక్క త‌క్కువ కాకుండా చూస్కో అని.

అగో అట్ల‌నే అన్న‌డు కేటీఆర్ కూడా చివ‌ర్ల‌. నీ ఏజెన్సీ ని ఇంటికి పంపించు… వారికి చాయ్, బిస్కుట్ తినిపిస్తా.. ఇయ్యాళ నీ బ‌ర్త్ డే క‌దా.. వారితో కేక్ కూడా క‌ట్ చేపిస్తా… అన్నాడు. కేటీఆర్‌ను ఫార్మూలా- ఈ కారు రేస్ విష‌యంలో అక్ర‌మంగా 55 కోట్లు విదేశీ సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వ ధ‌నాన్ని పంపించాడ‌నే అభియోగంపై ఏసీబీ విచార‌ణ చేసేందుకు రెడీ అవుతోంది. ఈలోపే కేటీఆర్‌కు మ‌లేషియా టూర్ వెళ్లాల్సి ఉంది. వెళ్లాలి. కానీ భ‌య‌ప‌డి పారిపోయాడ‌ని మీడియా గ‌గ్గోలు పెడుతుంద‌ని కేటీఆర్‌కు ఎవ‌రో ఉప్పందించారు.

అంతే..! టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇగో ఇలా స్పందించాడు. న‌న్ను అరెస్టు చేయండి.. ప్లీజ్ తొంద‌ర‌గా న‌న్ను అరెస్టు చేయండి… ప్లీజ్ ప్లీజ్ అని బ‌తిమాలుకుంటున్నాడు. రేవంత్‌ను రెచ్చ‌గొడుతున్నాడు.

You missed