ఆ బాలిక‌ క‌డుపేద‌ది. మైనార్టీ తీర‌లేదు. ఇంకా ప‌సిత‌నం వీడ‌ని వ‌య‌సు. రెక్కాడితే గానీ డొక్కాడ‌ని కుటుంబం. కుల‌వృత్తే ఆ బాలిక‌ త‌ల్లిదండ్రుల‌కు జీవ‌నాధారం. బ‌త‌క‌డానికి వ‌చ్చి అక్క‌డే స్థిర‌ప‌డ్డారు చాలా ఏళ్లుగా. క్రిష్టియ‌న్ మ‌తంలోకి మారారు. ప్ర‌తీ ఆదివారం చ‌ర్చికి వెళ్లి వ‌చ్చేది ఆ మైన‌ర్ బాలిక‌. పాస్ట‌ర్ ముసుగులో ఉన్న న‌య‌వంచ‌కుడు ఆ బాలిక‌పై క‌న్నేశాడు. మాయ‌మాట‌లు చెప్పి లోబ‌ర్చుకున్నాడు. ప్ర‌తి ఆదివారం చ‌ర్చికు వెళ్లిన ప్ర‌తీ సంద‌ర్బంలో ఆమె ఆ పాస్ట‌ర్ ముసుగులో ఉన్న కామాంధుడి కాటుకు బ‌లైతూ వచ్చింది. మ‌రోవైపు ఇంకో న‌ర‌రూప రాక్ష‌సుడు ఆ బాలిక‌పై క‌న్నేశాడు. ఇటీవ‌లే దుబాయ్ నుంచి వ‌చ్చి ఊర్లో జులాయిగా తిరుగుతున్న వీడికి ఆ బాలిక కంట‌బ‌డింది. కాటేసేందుకు వాడూ మాయ‌మాట‌లు చెప్పాడు. లోబ‌ర్చుకున్నాడు. ఆశ‌లు క‌ల్పించాడు. అత్యాచారం చేశాడు. ఈ ఇద్ద‌రు మాన‌వ‌మృగాలు కొంత‌కాలంగా అభంశుభం తెలియ‌ని ఆ బాలిక‌పై లైంగిక దాడి చేస్తూనే ఉన్నారు. ఇదెంత వ‌ర‌కు కొన‌సాగిందంటే ఆ బాలిక ఆరు నెల‌ల గ‌ర్భ‌వ‌తి అయ్యేంత వ‌ర‌కు. అప్పుడుగానీ ఈ విష‌యం వెలుగు చూడ‌లేదు. త‌ల్లిదండ్రులు విష‌యం తెలుసుకునే స‌రికి అప్ప‌టికే ఆల‌స్యం అయ్యింది.

నందిపేట మండ‌లంలోని డొంకేశ్వ‌ర్‌లో రెండ్రోజుల క్రితం జ‌రిగిన ఈ దారుణం లో కొత్త విష‌యాలు వెలుగుచూస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని స‌ఖీ సెంట‌ర్‌లో ఆ బాలిక త‌ల్లిదండ్రులు పాస్ట‌ర్‌పైనే ఫిర్యాదు చేశారు. కానీ అప్ప‌టికే ప్రేమికుడి ముసుగులో మ‌రొక‌డు ఆమె జీవితంతో ఆడుకున్నాడ‌నే విష‌యం వెలుగులోకి రావ‌డంతో పాస్ట‌ర్‌కు త‌ప్పించుకోవ‌డానికి దారి దొరికింది. పోలీసుల‌కు డ‌బ్బు ఎర చూపాడు. కేసును ప్రేమ‌పేరుతో కాటేసిన మ‌రొక‌డిపై నెట్టేశాడు. దీంతో పోలీసులు జులాయి వెధ‌వ‌పై కేసు న‌మోదు చేసి రి మాండ్ చేసి చేతులు దులుపుకున్నారు.

మ‌త ప్ర‌వ‌చ‌నాల‌తో సుద్దులు చెప్పే ఆ పాస్ట‌ర్ గాడు మాత్రం ద‌ర్జాగా తిరుగుతున్నాడు. ఆదివారం ఆదివారం చ‌ర్చిలో త‌న ప్ర‌వ‌చ‌నాల‌తో జ‌నుల‌ను చైత‌న్య ప‌రుస్తున్నాడు. మ‌రో అబ‌లను బ‌లిచేసేందుకు ఆబ‌గా ఎదురుచూస్తున్నాడు. డ‌బ్బు, ప‌ర‌ప‌తి ఉంటే ఏమి చేసినా త‌ప్పించుకుని స‌మాజంలో ద‌ర్జాగా తిరుగొచ్చ‌ని, దిక్కుమొక్కు లేని వారిపై లైంగిక దాడి చేసి త‌ప్పించుకుని నీతులు, సుద్దులు చెప్పొచ్చ‌ని ఈ ఘ‌ట‌న మ‌రోమారు అద్దం ప‌ట్టింది.

ఇప్పుడు ఈ స‌మాజం ఆ బాలిక‌ను వెలివేసేలా చూస్తున్న‌ది. క్యారెక్ట‌ర్‌లెస్ గా అంచ‌నా వేస్తున్న‌ది. మృగాళ్ల‌
కు ఇది స‌హ‌జ‌మే.. కానీ ఆ బాలిక అలాంటిదే కాబ‌ట్టి ఇదంతా జ‌రిగింద‌ని ఓ జ‌స్టిఫికేష‌న్ కూడా ఇచ్చేసింది. ఇదీ నేటి స‌మాజ‌తీరు. దుస్థితి.

You missed