ఇప్పుడు రాజ‌కీయాల్లో అర్జున్‌రెడ్డి ట్రెండ్ న‌డుస్తున్న‌ది. మాస్ మాట‌లు.. తిట్ల దండ‌కం వాడితేనే క్లిక్ అవుతామ‌నే అభిప్రాయం క్ర‌మంగా నేత‌ల్లో బ‌ల‌ప‌డుతూ వస్తున్న‌ది. హుందా రాజ‌కీయాల‌కు చెక్ ప‌డ్డ‌ది. ఇప్పుడంతా బూతుల భాష‌ణ్‌లు… అవే కోర‌కుంటున్నారు జ‌నాలు కూడా. బండి సంజ‌య్‌, ధ‌ర్మ‌పురి అర్వింద్‌తో మొద‌లైన ఈ బూతుల పురాణం… మాట‌ల దాడిని నేత‌లంతా అందిపుచ్చుకుంటున్నారు. మైనంప‌ల్లి మొన్న బండి సంజ‌య్‌పై విరుచుకుప‌డిన తీరు… టీఆరెస్ నేత‌ల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న‌ది.ఎన్ని తిట్లు తిడితే.. ఎంత బూతు మ‌ట్లాడితే అంత మొన‌గాడు అనే రీతిలో నాయ‌కులు, అనుచ‌రగ‌ణం కూడా ఫాలో అవుతున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. ఎంక‌రేజ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇదే పంథాను అవ‌లంభిస్తూ వ‌స్తున్నాడు. పీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత ఈ మాట‌ల దాడి మ‌రింత పెంచాడు. రావిర్యాల‌లో జ‌రిగిన మీటింగులో మాట‌ల తీవ్రత పెరిగింది. ఓరేయ్‌, స‌న్నాసీ, మ‌ల్లిగాడు, ఓరేయ్ కేటీఆర్‌, ఓరేయ్ సీఎం… అంటూ మాట‌ల దాడి కొన‌సాగింది. దీనికి కార్య‌క‌ర్త‌ల నుంచి విజిల్స్ కూడా తోడ‌య్యాయి. ఓ వైపు వర్షంలో కూడా స‌భ స‌క్సెస‌యిన ఉత్సాహంలో రేవంత్ కేసీఆర్‌ను, కేటీఆర్‌ను ఓరేయ్ అంటూ సంబోధించాడు. దీన్ని కార్య‌క‌ర్త‌లు ఎంజాయ్ చేశారు. ఇప్పుడంతా ఇదే కోరుకుంటున్నారు కాబోలు.

ద‌ళితుల విష‌యంలో కేసీఆర్ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టడంలో రేవంత్ స‌క్సెస‌య్యాడు. బాప‌నోళ్ల‌ను రిటైర్మెంటు అయినా కొన‌సాగించిన కేసీఆర్.. ద‌ళితుల‌కు మాత్రం ఎందుకు ఎక్స్‌టెన్ష‌న్ ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నించాడు. ఓ వైపు ద‌ళిత‌బంధు ప్ర‌క‌టించి … ఎస్సీల ఓట్లు కొల్ల‌గొట్టాల‌నే కేసీఆర్ వ్యూహానికి రేవంత్ ఈ స‌భ ద్వారా గండికొట్టే ప్ర‌య‌త్నం చేశాడు. ద‌ళిత దండోరా మ‌లివిడ‌త స‌భ కూడా స‌క్సెస్ అయింద‌నే చెప్పాలి.

You missed