Dear RSP,
మీరు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడకపోవటమే బెటర్..
సర్వీసులో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి మీరు చేసిన సాయం ఏంటి? వస్తుందో రాదో తెలంగాణ అనుకున్నప్పుడు మీ జాబ్ మీకు ముఖ్యం అయ్యింది. వచ్చిన తెలంగాణలో బహుజనుల జనాభా ఎక్కువ కాబట్టి ఉద్యోగం వదిలేసి రాజకీయబాట పట్టారు.
మా తెలంగాణ బిడ్డ ఎవరెస్టు ఎక్కినందని మేం సంతోషపడ్డం.. మా దళితబిడ్డ సాధించింది అని మీరంటున్నారు. దళితుల మీద మీది ఎల్లలేని ప్రేమ అయినపుడు ఉద్యమ సమయంలో మీరు సర్వీసులోనే ఉన్నరు కదా… మరి కేసులపాలైన దళితుబిడ్డలు బాల్క సుమన్, గాదరి కిశోర్, పిడమర్తి రవి, ఎర్రోళ్ళశ్రీనినివాస్ etc.. లకు ఏ విధంగా సాయపడ్డారు?
ఒక్క కేసు పెట్టినందుకు.. నా మీద కేసు పెట్టారు అని అందరి ముందు దేబిరిస్తున్నారు కదా!! కేసు ఇంటి? దాని తీవ్రత ఎంత? ఎలా ఎదుర్కోవాలో తెలిసిన Ex IPS ఆఫీసర్ అయ్యుండి సింపతీ కోసం ట్రై చేయటం మీ Sanityని తెలియజేస్తోంది.
కాలం కలిసొచ్చినప్పుడు దళితసాధికారత కోసం
మీ వంతు కృషి మీరు చేసుండచ్చు.. దాని గురించో.. బహుజనుల గురించో మాట్లాడండి. అంతే తప్ప తెలంగాణ ఉద్యమం గురించి మీరు మాట్లాడకపోవటమే బెటర్.
ఎందుకంటే ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిపడేసిన DSP నళిని మీకంటే బెటర్! జై తెలంగాణ అని రొమ్ము ఇరుసుకొని నిలబడ్డ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ ఉత్తముడు. తెలంగాణ బిడ్డల మీద లాఠీ ఎత్తలేక రివాల్వర్ తోని కాల్చుకొని ప్రాణ త్యాగం చేసిన కిష్టయ్య ధీరో దాత్తుడు.
Praveen Kumar Barapati