వాస్త‌వం ప్ర‌త్యేక ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

సీఎం రేవంత్‌రెడ్డికి భేష‌జాలు లేవు.. అదెప్పుడో తెలుసా! తెలంగాణ కోసం. సీఎం రేవంత్‌కు అహం లేదు. అదెప్పుడో తెలుసా..? తెలంగాణ కోసం నిధుల‌డిగే విష‌యంలో. సీఎంకు తార‌త‌మ్య బేధాలు లేవు..! ఇదెప్పుడో తెలుసా? తెలంగాణ కోసం పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించేందుకు ఎవ‌రినైనా క‌లిసే విష‌యంలో. సీఎంకు పార్టీల బేధాలు, శ‌త్రు భావం ఉండ‌దు.. ఇదెందుకో ఎరికేనా? తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ను హైద‌రాబాద్ కేంద్రంగా తెలంగాణకు చారిత్రాత్మ‌కంగా నిలిచేపోయే అద్భుత కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తున్న‌ప్ప‌డు.. అంద‌రినీ ఆహ్వానించే విష‌యంలో. ఇదంతా నేను చెబుతున్న క‌థ కాదు.. గ‌త కొన్ని రోజులుగా మ‌నం చూస్తున్న‌ది. అందుకే అంటున్నా..పైన చెప్పిన‌దాంట్లో అతిశ‌యోక్తి ఏమీ లేద‌ని.

సీఎం రేవంత్‌రెడ్డి సంక‌ల్పం, స్వ‌ప్నం క్లియ‌ర్‌గా ఉంది. అది చిన్న పిల్లలకూ అర్థ‌మ‌య్యేలా. “ఫ్యాక్టరీలు, పొలాలు కలిసి, నగరాలు, గ్రామాలు కలిసి, ధనవంతులు, పేదలు కలిసి ఉండాలి.” ఇది ఆయ‌న సంక‌ల్పం. శుభ్రమైన చెరువులు, పెద్ద ఆట మైదానాలు, ప్రపంచ స్థాయి ఆస్పత్రులు, పేద పిల్లలు, ధనిక పిల్లలు కలిసి చదువుకునే ఉచిత పాఠశాలలు – ఇవన్నీ ఆయన కల. ఇప్పుడు దీని కోసం సీఎం తండ్లాట‌. మోడీ తో, అన్ని పార్టీల నాయకులతో కూర్చొని “ఎన్నికలు గెలవడం కాదు, మన పిల్లల భవిష్యత్తు గెలవడం” అని మ‌న‌సులోని మాట ఆవిష్క‌రించారు ఈ మ‌ధ్య‌. అందరూ అంగీక‌రించారు ఆయ‌న మాట‌ల‌ను. తెలంగాణ కోసం శత్రువుల్ని కూడా స్నేహితుల్ని చేయ‌డం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఇప్పుడ‌దే మంత్రం తెలంగాణ‌కు వ‌రం కానుంది.

ఈ ప్రేమ, ఈ ఐక్యత వల్ల ప్రపంచం నలుమూలల నుంచి కంపెనీలు లైన్ కడుతున్నాయి. భారత్ తర్వాత చైనా అవ్వాలంటే, తెలంగాణ తలుపు తెరిచి “మన ద్వారానే రండి” అంటోంది! ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ తెలంగాణ‌కు ఒక మహత్తర అవకాశం. ప్రపంచం నలువైపుల నుంచి పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, నాయకులు వచ్చి “తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలి?” అన్న దానిపై కలిసి కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్నారు.
ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోంది—మన సామర్థ్యాన్ని నమ్ముతోంది. హైదరాబాద్ త్వరలో నవ్వుల నగరం, కలల నగరంగా మార‌డ‌మే కాదు.. వచ్చిన ప్రతి అతిథి “ఇక్కడే ఉండాలనిపిస్తోంది” అనేలా సిటీ మార‌నుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి ఉండ‌ద‌నే భావ‌న కలుగుతోంది అంద‌రిలో.

You missed