(దండుగుల శ్రీనివాస్)
అనుష్క విశ్వరూపం చూస్తారన్నాడు క్రిష్. విశ్వరూపమేమో గానీ ఆమెను ఓ దగ్గర నగ్నంగా నిలబెట్టాడు. కథను ఎంచుకోవడమే గత్తరబిత్తర గంజాయి కథ. ఘాట్‌లలో గంజాయి రవాణా చేయడమే తప్ప వేరే దారిలేదనే ఘాటిల స్టోరీలైన్ కాస్త అనుష్క శెట్టిని ఓవర్ యాక్షన్ .. యాక్షన్ సీన్లు తీసి రక్తపాతం పారించే వరకు పోయింది. కథ లైన్ అదుపు తప్పి గంజాయి గత్తరలో మునిగి కళ్లు తేలేసింది. ఈ సినిమా కథను అనుష్క కోసమే రాసుకున్నట్టున్నాడు. హీరోగా విక్రమ్ ప్రభును బలి చేశాడు.
ఓ లైన్ అనుకొని అలా అలా అల్లుకుని పోయాడేమో.. మధ్యలో సంబంధం లేకుండా నడుస్తున్న కథ.. ఎటు పోతుందో..? ఏమవుతుందో..? అపరిచితుడులో విక్రమ్‌లా అనుష్క ఒక్కసారిగా వీర విహారం చేసి బాహుబలిలో అనుష్కలా దర్శనమిస్తూ ఉంటుంది. విజయశాంతిలా ఎగిరెగిరి పైటింగులు చేసింది పాపం. బాగనే కష్టపడింది కానీ.. ఆ పాత్రకు అస్సలు యాప్ట్ కాలేదు. క్రిష్.. అనుష్క నటనను, యాక్షన్ సీన్లను వృథా చేసుకున్నాడు. సినిమా మొత్తం గంజాయి.. గంజాయి.. గంజాయి.. లాజిక్కులు లేవు. లక్ష్యం లేదు. బిట్లు బిట్లుగా అనుష్క ఫైట్స్‌ను చూస్తే మాత్రం అబ్బ బాగా తీశార్రోయ్.. అనిపిస్తుందంతే. కథగా సినిమా చూస్తే వేస్ట్. ఇదో వృథా ప్రయత్నమే.
Dandugula Srinivas
8096677451