(దండుగుల శ్రీనివాస్)
ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందంట…
ఇంకెవరినీ మోసగించనని..
ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట..
తోటి జంతువులను సంహరించనని
ఈ కట్టుకథ విని గొర్రెలన్నీ పుర్రెలూపుతున్నాయి..!
ఇది అలిశెట్టి ప్రభాకర్ కవితా రూపం. అచ్చంగా అలాగే ఉంది బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్ వైఖరి ఇవాళ అసెంబ్లీలో. నోటితో నవ్వుతు నొసటితో వెక్కించిన చందంగా.. తనకు అలవాటైన సహజ సిద్ధమైన దోరణిలో మాట్లాడి అభాసుపాలై, నవ్వులపాలై.. బీసీల మనసు చూరగొనడమేమోగానీ.. బీసీ వ్యతిరేక ముద్రవేసుకున్న బీఆరెస్‌కు నిజమైన వారసుడనిపించుకున్నాడు. బీసీ రిజర్వేషన్ల పై జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడిన అంశాలు, మాటలు, విమర్శలు తీవ్ర వివాదమయ్యాయి. అప్పుడే సంపూర్ణ మద్ధతంటాడు. కానీ… రేవంత్ అలా చేసేదుండే.. ఇలా చేసేదుండే.. అని ఏవో సాకులు.. వంకలు. చివరగా అతను చెప్పిందాంట్లో ఒక్కటి మాత్రం క్లారిటీగా అర్థమైంది బీసీ జనానికి.
ఈ బిల్లుపై ఎవరైనా కోర్టుకు పోయే వీలుందని. అంతెందుకు.. పోతే గీతే మేమే పోతామని. ఎన్నో అనుమానాలు లేవనెత్తేడే తప్ప.. దీనిపై ఇలా పోదాం.. సాధించుకుందామనే ఒక్క.. ఒక్క మాట కూడా రాలేదు ఆ నోటి వెంట. మేం ఏం చేశామని చెప్పుకునే క్రమంలో.. సమర్థించుకునే సందర్భంలో అడుగడుగునా దొరికిపోయాడు. ఆ మాటల్లో వెలితి వెల్లడైంది. డొల్లతనం కొట్టిచ్చినట్టు కనిపించింది. నోటికొచ్చినట్టు మాట్లాడే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ.. అన్న సామెతను పక్కాగా ఫాలో అయిన నటన తీరును పట్టేసింది బీసీ జనం. ఓకే అంటాడు. ఇది కాని ముచ్చటని పెదవి విరుస్తాడు. మీవోళ్లే ఆనాడు కోర్టుకు పోయాడని.. దీన్ని అమలు చేయడం సాధ్యకాదనే పైశాచికానందం ప్రదర్శిస్తాడు.
వేరే వాళ్లెందుకు.. మేమే పోతామనే సంకేతాలిస్తాడు. ఏవేవో పిచ్చి పిచ్చి ప్రేలాపనలు. గతి తప్పిన మాటలు. గతంలో చేసిన తప్పులను సమర్థించుకునే ప్రయత్నంలో మరిన్ని పొరపాట్లు. తప్పటడుగులు. తప్పుదోవలు. పక్కదారులు పట్టించే పన్నాగాలు. మొత్తంగా… అర్థమయ్యిందేమంటే.. బాప్ ఏక్ నెంబరీ… బేటా దస్ నెంబరీ… కేసీఆర్ ఆనాడు బీసీలపై చూపిన కపట ప్రేమ…. మోసం, దగా. ఈనాడు కేటీఆర్ రూపంలో అది పదింతలు కనిపించింది.
Dandugula Srinivas
Senior Journalist
8096677451