భరోసా లేక బావురుమంటే..! ముఖాముఖి మురిపెం మాకెందుకు..!? రైతులతో సీఎం ఇంటరాక్షన్… రైతు భరోసా వేస్తామంటున్నారు… పాతవా..? వానాకాలం సీజన్‌కా..?? క్లారిటీ లేదు.. భరోసాపై మంత్రి మాటలు నమ్మని రైతులు.. సర్కార్‌పై నమ్మకం సడలుతున్న వైనం..
(దండుగుల శ్రీనివాస్) ఎవరు అధికారంలోకి వచ్చినా మాది రైతు సర్కార్ అనే అంటారు. రైతుల మనసు గెలిచేందుకు ప్రయత్నిస్తారు. కాంగ్రెస్ సర్కార్ కూడా అదే చెప్పింది. కానీ చేతల్లో అది కనిపించలేదు. ఇంత త్వరగా రైతుల నుంచి వ్యతిరేకత ఎదుర్కుంటుందని ఎవరూ…