వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్:
తేల్చుకుందామా నీ పతాపమో.. నా పతాపమో… అని ఫ్యాక్షనిస్టు సినిమాలో డైలాగు కొట్టాడు ఎక్స్ వేదికగా కేటీఆర్. ఇద్దరిపైనా ఏసీబీ కేసులున్నాయి. నువ్వు దొంగవో.. నేను దొంగనో తేల్చుకుందాం రా..! లై డిటెక్టర్ పరీక్షలకు పోదాం.. దమ్ముందా..! వస్తవా…! రా .. అని తొడలు చరిచి సవాల్ విసిరాడు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్. గతంలో కూడా ఇలాగే సవాల్ విసిరాడు. ఈ తరహా ప్రకటనలతో కేటీఆర్ తను సచ్చీలుడినీ కానీ రేవంత్ కక్షసాధింపుతో ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడనే విషయం జనాలకు తెలియాలని భావిస్తున్నట్టున్నాడు.
ఆయనింకా ట్విట్టర్‌లో ఏమన్నాడంటే.. ముఖ్యమంత్రి ప్రజల దృ ష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తు న్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు.. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, బ్యాంకు ద్వారా పంపి న 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ము లా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడు. చట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుం డా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానని మాటిస్తున్నాను. అయితే, పదేళ్ల క్రితం నో టుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరి ధిలో పెండింగ్‌లో ఉంది. ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా? అని ప్రశ్నించారు.
