(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింది నిజ‌మే. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు వేల మందివి. వీళ్లు కాదు వాళ్లు కాదు అన్ని సెక్ష‌న్ల‌వి. దీంట్లో పెద్ద మ‌నిషి పాత్ర‌లేనిదే, అనుమ‌తులు లేనిదే, చెప్ప‌నిదే జ‌ర‌గ‌దు. కానీ ఇది అనూహ్యంగా కేటీఆర్ మెడ‌కు చుట్టుకుంది. పెద్దాయ‌న‌కు కావాల్సింది అధికారం. దాని కోసం ఆయ‌న ఈ ఫోన్ ట్యాపింగ్‌ను వాడుకున్నాడు. ఇది స‌హ‌జ‌మే. ష‌రా మామూలే అనేది ఆయ‌న స‌మ‌ర్థింపు. అది వేరే విష‌యం. కానీ దీన్ని కాంగ్రెస్ సోష‌ల్ మీడియా, ఆ పార్టీ కేటీఆర్‌కు సినీ ఇండ‌స్ట్రీతో లింకులు పెట్టింది. ప‌లువురు హీరోయిన్ల ఫోటోల‌తో నేరుగా రంకు అంట‌గ‌ట్టింది. దీన్ని విచ్చ‌ల‌విడిగా ట్రోలింగ్ చేస్తున్నారు. వాస్త‌వానికి, మొన్న‌టి వ‌ర‌కు కేటీఆర్ సోష‌ల్ మీడియానే బ‌లంగా ఉంది. రేవంత్‌రెడ్డిని ఆడుకున్నారు. ఏ చిన్న కార‌ణం దొరికినా, లోపం క‌న‌బ‌డ్డా.. వెట‌కార‌పు, వ్యంగ్య విమ‌ర్శ‌ల‌తో దాడి చేశారు సోష‌ల్ మీడియా వేదిక‌గా. ఆ సోష‌ల్ మీడియాకు తోడు కేటీఆర్ దూకుడు కూడా మామూలుగా లేదు.

ఇక రెండు మూడు నెల‌ల్లో ఎన్నిక‌లు రాబోతున్నాయ‌నే ఫీలింగుతో స‌ర్కార్‌, రేవంత్‌పై దాడి జ‌రిగింది. దీన్ని త‌ట్టుకోలేక‌పోయాడు రేవంత్‌. ఆయ‌న‌కు ఆ పార్టీలో స‌పోర్టు కూడా క‌రువైంది. ఎవ‌రూ ఖండించేవాళ్లు లేరు. తిప్పికొట్టేవాళ్లు లేరు. గ‌ట్టిగా ఎదుర్కొనే వాళ్లే లేరు. ఈ క్ర‌మంలో కాళేశ్వ‌రం క‌మిష‌న్ పేరుతో కేసీఆర్‌న విచార‌ణ బోనులో నిల‌బెట్టాడు రేవంత్‌. దీనికీ కేసీఆర్ జంక‌లేదు. కొంత ఇబ్బంది ప‌డ్డా, త‌రువాత జ‌నం త‌న‌తోనే ఉంటారు. స‌మ‌యం వచ్చిన‌ప్పుడు కాళేశ్వ‌రంపై స్పందిస్తాన‌నే వ్యూహంతో కేసీఆర్ ఉన్నాడు. కానీ అటు కేసీఆర్‌కు, ఇటు కేటీఆర్‌కు , మొత్తంగా పార్టీకి ఫోన్ ట్యాపింగ్ రూపంలో భారీ ఎదురుదెబ్బే త‌గిలింది.

దీని ద్వారా కేటీఆర్ జైలుకు పోతాడా..? పోడా..? అనేది కాదు ఇక్క‌డ డిస్క‌ష‌న్. దీన్ని ఆస‌రా చేసుకుని కాంగ్రెస్ సోష‌ల్ మీడియా రెచ్చిపోతోంది. ఏకంగా హీరోయిన్ల ఫోటోలు, కేటీఆర్ ఫోటోల‌తో జ‌త చేసి య‌థేచ్చ‌గా సోష‌ల్ మీడియాలో తిప్పుతున్నారు. ఎప్పుడో శ్రీ‌రెడ్డి .. మాట్లాడిన వీడియోను కూడా ఓ వ్యూహాత్మ‌కంగా బ‌య‌ట‌కు తీశారు. అప్ప‌టి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి త‌న‌ను పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌కు ర‌మ్మ‌న్నాడ‌ని, త‌న వెనుక కేటీఆర్ ఉన్నాడ‌ని ఆయ‌న చెప్పిన‌ట్టు ఈమె చెప్పిన వీడియోను మళ్లీ బ‌య‌ట‌కు తీశారు. గిర్రాగిర్రా తిప్పుతున్నారు. ఎంత డ్యామేజీ చేయాలో అంత చేస్త‌న్నారు. కేటీఆర్ క్యారెక్ట‌ర్ అసాసినేష‌న్ విశృంఖ‌లంగా, విచ్చ‌ల‌విడిగా, వికారంగా, విలువ‌లు లేకుండా కొన‌సాగుతోంది. దీన్ని అడ్డుకునేవారు లేరు. ధీటుగా ఎదుర్కొనేవాళ్లు లేరు. కేసీఆర్ వ్యూహాత్మ‌క మౌనం … సానుభూతి… ఈ క్యారెక్ట‌ర్ అసాసినేష‌న్ ముందు కొట్టుకుపోతున్నాయ‌నే చెప్పాలి.

Dandugula Srinivas

Senior Journalist

8096677451

 

 

 

 

 

 

You missed