(దండుగుల శ్రీనివాస్)
మాకెవరితో కలిసే ఖర్మ పట్టలేదన్నాడు హరీశు. ఒంటరిగానే పోతమన్నాడు. ఒంటి చేత్తో వంద గెలుచుకొస్తాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే అని కూడా వాగేశాడు. సేమ్ మామ లెక్కనే. బామ్మర్ధి తీరుగనే. ఏ మాత్రం అహం తగ్గలేదు ఎవరికి. తగ్గేదేలేదంటుందా కల్వకుంట్ల కుటుంబం. కవితక్క చెప్పింది నిజమే. మళ్లీ వాళ్లకే ఇంచార్జిలిచ్చాడు కేసీఆర్. అంతకు మించి చేసేదేముందిలే. పదేండ్లు బాగా పెంచి పోషించాడు. జనాలు చీ థూ అని చీదరించుకున్నా.. ఇది కేసీఆర్‌కు హుకూం అన్నాడు. జనంతోనే ఢీ కొట్టాడు. ఫలితం ఫామ్‌హౌజ్‌లో పండవెట్టారు జనాలు. అయినా మారలేదు. కాంగ్రెస్ పై పెరుగుతున్న వ్యతిరేకత ..వారిలో అహం తగ్గించేలా చేయలేదు. మరింత పెరిగేలా చేసింది. జనాలు తప్పు తెలుసుకున్నారు. వాళ్లకు తగిన శాస్తి జరిగింది. ఇక చచ్చినట్టు మమ్మల్నే ఎన్నుకోవాలె. మేము దిక్కు. ఇగో ఇట్లనే ఆలోచిస్తున్నారు. ఎక్కడికి పోయినా ఇవే పిచ్చి కూతలు కూస్తున్నారు.
అప్పుడే మళ్లీ అధికారంలోకి వచ్చినట్టే కలలు కుంటున్నారు. అట్లనే బీహేవ్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వంద గెలుస్తామంటున్న హరీశ్.. గివే ముఖాలేసుకుని వంద సీట్లు గెలుస్తారా..? జనం మళ్లీ నేలకేసి కొడితే పాతాళానికే పోతారు. మరి వారిని మార్చరెందుకు..? వాళ్ల జుట్టు మీ చేతుల్లో ఉందా..? మీ కుత్తుక వాళ్ల చేతుల్లో ఉందా..? ఒకరిదొకరు విడదీయరాని బంధం. కవిత బయటకు పోయిందే మంచిదైంది. మాకు ఇక తిరుగులేదనుకుంటున్నారు చాలా మంది. మళ్లీ మళ్లీ వాళ్లే పోటీ చేస్తారట. జనాలు యాక్ థూ అన్నా. మూడు సార్లు ఇచ్చిన వాళ్లకే ఇచ్చి వారిని అరాచకశ్తులుగా పెంచి పోషించిన కేసీఆర్‌కు ఇంత శాస్తీ జరగాల్సిందే. ఇంకా తేరుకోకపోతే ఇంకా ఇంకా కావాల్సిందే.
చిత్తుగా ఓడిన ఎమ్మెల్యేలు ఇంకా ఇంచార్జిల ముఖమేసుకుని తిరుగుతున్నారు. పార్టీని సంకనాకిచ్చినోళ్లు మళ్లీ మాదే రాజ్యమని కాలరెగురేసుకుని.. బయలుదేరారు. కార్యకర్తలను, ఉద్యమకారులను కాలి చెప్పులాగా చూసి జనాల జీవితాలతో ఆడుకున్న బలిసిన పందికొక్కులే మళ్లీ మాది నల్లముఖం కాదు.. తెల్లముఖమే అని పౌడర్ కొట్టుకుని రెడీ అవుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఏం తక్కువ కాదు. చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగానే ఆ ముఖాలూ గెలిచాయి. అంటే అన్నింటా… అంతటా రెండు టర్ములు చేసిన వీరందరినీ జనం వద్దురా నాయన మీరు అనే తీర్పే ఇచ్చారు. అగో ఇప్పుడు కేసీఆర్ ఇంకా వారినే పట్టుకుని వేలాడుతున్నాడు. మళ్లీ మాదే అధికారం అని ఫామ్‌హౌజ్‌లో పండుకుని పగటికలలు కంటున్నాడు. వేదికల మీద బావబామ్మర్దులిలా తొడలు చరుచుకుంటూ శపథాలు చేస్తూ మేం మారలే.. మేమింతే.. మేమింతేనని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు.