(దండుగుల శ్రీ‌నివాస్‌)

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌కు నో చెప్పేశాడు రాహుల్‌. అవును… చివ‌రి వ‌ర‌కు వెళ్లిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఫైలు రాజ‌గోపాల్ రెడ్డి పేరు ఉండ‌టంతో నిలిచిపోయింది. దీనికి కార‌ణం రాజ‌గోపాల్‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే మంచి సంకేతం వెళ్ల‌ద‌నే రాహుల్ నిర్ణ‌య‌మే. ఇది ముగ్గురికి షాక్ ఇచ్చింది. ఆల్రెడి న‌లుగురు పేర్లు లిస్టులో ఉన్నాయి. వాకిటి శ్రీ‌హ‌రి ముదిరాజ్‌, వివేక్ వెంక‌ట‌స్వామి, సుద‌ర్శ‌న్‌రెడ్డి పేర్ల‌తో పాటు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. కానీ రాజ‌గోపాల్‌రెడ్డి పేరు ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి రాహుల్ చికాకు ప‌డ్డాడు. వ‌ద్ద‌న్నాడు. ఫైల్ పెండింగ్‌లో ప‌డింది. అప్ప‌టికే ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా నుంచి త‌నకు మంత్రి ప‌దవి కావాల‌ని గ‌ట్టిగా త‌న గ‌ళాన్ని వినిపిస్తూ వ‌స్తున్న ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి కి ఇది దారి సుగ‌మం చేసింది.

16Vastavam.in (6)

అంత‌లోపే పెద్ద‌లు జానారెడ్డి కూడా లేఖ రాయ‌డం క‌లిసివ‌చ్చింది. దీంతో దాదాపుగా రాజ‌గోపాల్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్కే చాన్స్‌లేద‌ని రూడీ అయిపోయింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిథ్యం బాగా త‌క్కువ‌. పార్టీ బ‌లం కూడా త‌క్కువే. జ‌నాభా ప‌రంగా చూస్తే దాదాపు స్టేట్‌లో స‌గం. మ‌రి అన్ని జిల్లాల‌కు స‌మ‌న్యాయం జ‌ర‌గ‌న‌ప్పుడు త్యాగం చేసి మ‌రీ సోనియాగాంధీ తెలంగాణ‌ను తెచ్చిపెడితే ఇదేం న్యాయం..? అని ఇబ్ర‌హీంప‌ట్నం కాంగ్రెస్ నేతలు గ‌గ్గోలు పెడుతున్నారు. అధిష్టానం వ‌ద్ద మొర పెట్టుకుంటున్నారు.

త‌మ నేత‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సిందేన‌ని గ‌ట్టిగా కోరుతున్నారు. వాదిస్తున్నారు. దీంతో ఇది ఇద్ద‌రి మ‌ధ్య‌పోరుగా నిలిచింది. కానీ త‌నకు బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరేట‌ప్పుడు ఏఐసీసీ పెద్ద‌లు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని గుర్తు చేస్తున్నాడు కోమ‌టిరెడ్డి. కానీ ఆ హామీని ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి అక్క‌డ లేదు. ఎందుకంటే సామాజిక స‌మీకర‌ణ విష‌యంలో అధిష్టానం ఆచితూచి అడుగేస్తున్న‌ది. అందులో కోమ‌టిరెడ్డికి ఇస్తే అన్నీ చెడు సంకేతాలు, పార్టీకి, ప్ర‌భుత్వానికి న‌ష్ట‌మే త‌ప్ప .. న‌యా పైసా లాభం లేద‌నే అభిప్రాయంతో రాహుల్ గాంధీ ఉన్నాడు.

దీంతో మ‌ల్‌రెడ్డికి మంచి చాన్స్ వ‌చ్చింది. మంత్ర‌య్యే యోగం ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ట్టేన‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. పాపం.. ఆ ముగ్గురు మాత్రం మొన్న మూడో తారీఖునాడు ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు రెడీ అయి … రాజ్‌గోపాల్‌రెడ్డి ఇచ్చిన షాక్‌తో ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఎప్పుడు మ‌ళ్లీ విస్త‌ర‌ణ జ‌రుపుతారో..? ఎప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారో కూడా తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి నెల‌కొని ఉన్న‌ది ప్ర‌స్తుతానికి.

You missed