(దండుగుల శ్రీనివాస్)
తన రాజకీయల కోసం గుర్రం దొరికేదాకా ఏ గాడిదనైనా ఎక్కుతానన్నాడు. ఒక గాడిదను వదిలి .. అదే ఒక పార్టీని వదిలి మరో పార్టీ ఎక్కాడు. అదే చేరాడు. ఎక్కుతున్నాడు. దిగుతున్నాడు. ఎక్కేటప్పుడు మెచ్చుకుంటున్నాడు. మెడలేసుకుంటున్నారు. ఆ తరువాత దిగిపోవాలనుకున్నప్పడు తిడుతున్నాడు. దిగిపోతున్నాడు. ఇంకో గాడిదను వెతుక్కుంటున్నాడు.
ఇప్పటి దాకా గాడిదలు మార్చే ఈ గాడిదకు గుర్రమైతే దొరకలేదు. దొరికితే ఇంకా గాడిదలెక్కిదిగే పనెందుకు పెట్టుకుంటాడు.. గాడిదలా గొడ్డు కష్టమెందుకు పడతాడు. ఇప్పుడు బీసీ నినాదమెత్తుకున్నది ఈ గాడిదలెక్కే పార్టీ. ఢిల్లీలో బీసీ గొంతు వినిపించాలె. ఆ గొంతే ఇప్పుడు బీసీలందరి గొంతు. ఆ గాడిదేంచెబితే అది. అది పెట్టిన ఓండ్రే బీసీల ఆత్మగౌరవమనుకోవాలె. ఆ గాడిదకన్యాయం జరిగితే మనకు జరిగినట్టేనని మనకు ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టేనని భావించాలి.
ఇప్పుడు ఇదింకో గాడిదను చూసుకున్నది. అంతకు ముందు ఆ గాడిదను తుక్కుతుక్కు తిట్టిన.. ఎడమకాలితో పెకా పెకా తన్నిన చోట తన్నకుండా తన్ని తన్నీ వదిలింది. కానీ ఇప్పుడు ఒక గాడిద అవసరం మరో గాడిదకు. అందుకే ఢిల్లీలో ఓండ్రపెట్టేందుకు కలిసి రావాలని ఒకరికొకరు అనుకున్నారు. అయినా ఏ గాడిద ఏ గాడిదతో కలిస్తే నీకెందుకు రా బై.. గాడిద…! అంతే అంతే.. ! కానీ ఒక్కటి మాత్రం నిజం. గాడిద కష్టపోతు. దానికష్టం ముందు ఏదీ పనికిరాదు. అది తన కోసం పనిచెయ్యదు. ఇతరులకు కోసం పనిచేస్తది. నేను చెప్పేది గాడిద గురించి వయా…! ఈ గాడిద గురించి కాదు..