Dandugula Srinivas
ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి మానస పుత్రిక, నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యం మరోసారి మారుతున్నది. ఉద్యమ సమయలంలో పెట్టిన నమస్తే తెలంగాణ పత్రిక మరోసారి మార్పులకు సిద్దమైంది. సీఎం కేసీర్ నమస్తేకు గుడ్‌బై చెప్పినట్టు తెలిసింది. మేననేజింగ్ డైరెరక్టర్ దీవకొండ దామోదర్ రావు రాజీనామా చేశారు. ఇప్పటి వరకు లాభాలు, నష్టాలు లెక్కలు తీసే పనిలో ఉన్నారు. తొమ్మిదిన్నరేళ్లు బీఆరెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయమే వందలకోట్లు ఉన్నట్టుగా తెలిసింది. గతంలో ఉద్యమ సమయంలో 2011లో తెలంగాణ ఉద్యమం కోసమని కేసీఆర్ దీన్ని ప్రారంభించారు. మొదట్లోనే ఈ పత్రిక తీవ్ర ఒడిదుడుగులెదుర్కొంది. ఈ తరువాత 2013 పారిశ్రామిక వేత్త సీఎల్ రాజంకు బలవంతంగా బాధ్యతలు అప్పగించారు.
కేసీఆర్ అధికారంలోకి రాగానే మళ్లీ దీన్ని లాగేసుకున్నారు. కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిందప్పుడు. రాజ్యం ఒత్తిడికి అప్పుడు రాజం తలవంచక తప్పలేదు. హక్కులను వదలుకొని సరెండర్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చేసుకున్న ఆర్థిక ఒప్పందాలు అమలయ్యాయాల లేదా అనేది రాజంకే తెలియాలి.
అధికారంలో ఉన్సప్పుడు పేపర్ నీడపడం, అధికారం పోయాక ఇతరులకు అప్పజెప్పడం కేసీఆర్‌కు అలవాటుగా మారింది. ఈ పత్రికను నడిపే బాధ్యతలు తీసుకునేందుకు హెటిరో డ్రగ్స్ ఎండీ పార్థసారథి రెడ్డితో పాటు ఇతర పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరికి పత్రిక బాధ్యతలు అప్పగిచేందుకు రంగం పూర్తయ్యింది. దీన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
తక్కువ పెట్టుబడి ఎక్కువ లభాలతో నమస్తే తెలంగాణ పత్రిక నడిచింది. కేసీఆర్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లు ఈ పత్రిక ఏకచత్రాధిపత్యంగా ఏలింది. వందల కోట్ల లాభాలార్జించింది. కరోనా సమయంలో హెటిరో సంస్థపై ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో భారీగా పైకం పట్టుబడింది. ఈ దాడులలో పట్టుబడ్డ డబ్బులతో ప్రపంచమే నివ్వెర పోయింది. ఈ కేసు గురించి ఆ తరువత ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడూ లేటుగా వచ్చే జీతాలు ఫిబ్రవరి మాసంలో నెలాఖరులోనే పడ్డాయి. ఇది ఉద్యోగులందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మార్పులే దీనికి కారణంగా తెలుస్తోంది.